ఏపీ విభజన కేసు విచారణ 18కి వాయిదా! | AP partition case hearing adjourned till April 18 | Sakshi
Sakshi News home page

ఏపీ విభజన కేసు విచారణ ఏప్రిల్‌ 18కి వాయిదా!

Published Tue, Apr 11 2023 7:07 PM | Last Updated on Tue, Apr 11 2023 7:09 PM

AP partition case hearing adjourned till April 18 - Sakshi

సాక్షి, ఢిల్లీ:  ఏపీ విభజన కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.  ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, తెలంగాణ వికాస కేంద్ర తదితరులు దాఖలు చేసిన పిటిషన్లు ఇవాళ జస్టిస్‌ కేఎం జోసెఫ్, జస్టిస్‌ బీవీ నాగరత్నల ధర్మాసనం ముందుకొచ్చింది.

మధ్యాహ్నా భోజన విరామ సమయానికి ముందు ఏపీ తరఫు అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్స్‌ మెహ్‌ఫూజ్‌ నజ్కీ ఈ పిటిషన్లు విచారించాలని న్యాయమూర్తుల్ని కోరారు.  ఇటీవలే రాజధాని కేసు విచారణ వాయిదా అంశాన్ని గుర్తు చేసిన జస్టిస్‌ కేఎం జోసెఫ్‌.. ఈ పిటిషన్లు కూడా అవేనా అని ఆరా తీశారు. రెండు అంశాలకు సంబంధం లేదని వేర్వేరు పిటిషన్లుగా ఇప్పటికే వేరు చేసి జాబితా చేశారని నజ్కీ వివరించారు. భోజన విరామ అనంతరం కేసుల విచారణలో భాగంగా విచారిస్తామని న్యాయమూర్తులు తెలిపారు.

సాయంత్రం కోర్టు సమయం ముగిసేనాటికి పిటిషన్లు బెంచ్‌ మీదకు రాకపోవడంతో ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ఈ పిటిషన్లు వచ్చే మంగళవారం విచారిస్తామని, ఆ మేరకు విచారణ జాబితా చేర్చాలని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ రిజిస్ట్రీని ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement