న్యూఢిల్లీ: మార్గదర్శిపై 17 ఏళ్ల న్యాయ పోరాటంలో కీలక మలుపు చోటుచేసుకుందని మాజీ ఎంపీ, సీనియర్ న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో మార్గదర్శి కేసు విచారణ సందర్బంగా ఉండవల్లి అరుణ్ కుమార్ సాక్షి మీడియాతో మాట్లాడారు.
‘డిపాజిట్లను ఎంత మందికి తిరిగి చెల్లించారు?. చెక్కుల రూపంలో ఇచ్చారా?. మరో రూపంలో ఇచ్చారా?. డిపాజిటర్ల అన్ని వివరాలను కోర్టుకు అందజేయాలి. ఒకచోట హెచ్‌యూఎఫ్, మరో చోట ప్రొప్రైటరీ అని ఎందుకు రాశారు?. ఈ విషయాలన్నింటికీ సమాధానం చెప్పాలి’ అని పేర్కొన్నారు.
కాగా మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డిపాజిట్ల వివరాలు బయటపెట్టాలని సుప్రీం ఆదేశించింది. మార్గదర్శిలో ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? చెల్లింపులు ఎంత? వివరాలు బయట పెట్టడంలో రహస్యం ఎందుకని ప్రశ్నించింది. డిపాజిటర్లందరికీ చెల్లింపులు చేశామని మార్గదర్శి లాయర్ తెలపగా, చెల్లింపులు చేశాక వివరాలు బయటపెట్టడంలో అభ్యంతరం ఏంటని మాజీ ఎంపీ ఉండవల్లి వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది.
చదవండి: ‘విజయ్‌కుమార్ స్వామి.. రామోజీ వియ్యంకుడి విమానంలోనే వచ్చారు’
Comments
Please login to add a commentAdd a comment