అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్‌కు తప్పుడు అఫిడవిట్‌ను సమర్పించారని ఆరోపిస్తూ అరవింద్ కేజ్రీవాల్‌పై దాఖలైన ఫిర్యాదును కోర్టు నేడు విచారించనుంది.
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్‌కు తప్పుడు అఫిడవిట్‌ను సమర్పించారని ఆరోపిస్తూ అరవింద్ కేజ్రీవాల్‌పై దాఖలైన ఫిర్యాదును కోర్టు నేడు విచారించనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో తప్పుడు చిరునామాను పేర్కొన్నారని, అలాగే తన ఆస్తుల విలువను కూడా మార్కెట్ ధర కంటే తక్కువ చేసి చూపారని భారత్ మౌలిక్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ కోర్టుకు ఫిర్యాదు చేసింది. ప్రజాప్రాతినిథ్యచట్టం, సెక్షన్ ఏ ప్రకారం ఈ నేరానికి పాల్పడిన వ్యక్తి ఆరునెలల జైలుశిక్షతోపాటు జరిమానా కూడా భరించాల్సి ఉంటుంది. కాగా ఏ కేసు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ విజేతా సింగ్ ధర్మాసనం ముందుకు నేడు విచారణకు రానుంది.