గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. తనకు కోటిన్నర విలువ చేసే ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, తన దగ్గర రివాల్వర్, రైఫిల్‌తో పాటు స్మార్ట్‌ఫోన్ ఉన్నట్టు వెల్లడించారు.
యోగి ఆదిత్యనాథ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో రూ.1,54,94,054 ఆస్తులను ప్రకటించారు. ఇందులో చేతిలో నగదు, ఆరు బ్యాంకు ఖాతాల బ్యాలెన్స్, సేవింగ్స్ ఉన్నాయి. తన వద్ద రూ. 12,000 విలువైన సామ్‌సంగ్ మొబైల్ ఫోన్, రూ. 1,00,000 విలువైన రివాల్వర్, రూ. 80,000 విలువైన రైఫిల్ ఉన్నట్లు తెలిపారు. తన పేరు మీద వ్యవసాయ, వ్యవసాయేతర భూములు లేవన్నారు. అలాగే సొంత వాహనం కూడా లేదని వెల్లడించారు.
యోగి ఆదిత్యనాథ్ వద్ద రూ.49,000 విలువైన 20 గ్రాముల బంగారు చెవి రింగు, రూ.20,000 విలువైన 10 గ్రాముల బంగారు గొలుసు, రుద్రాక్ష హారం ఉన్నాయి. తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. (చదవండి: పదేళ్లు కావొస్తున్నా.. మానని గాయం!)
2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 13,20,653 ఆదాయం, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 15,68,799 ఆదాయం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 18,27,639 ఆదాయం, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 14,38,670 ఆదాయాన్ని ఆయన ప్రకటించారు. (క్లిక్: ఆయనే బలం, ఆయనే బలహీనత.. ఉప‘యోగి’కి పరీక్ష!)
Comments
Please login to add a commentAdd a comment