
సాక్షి, జగిత్యాల : జిల్లా పరిధిలో ఓ 80 ఏళ్ల వృద్ధురాలు తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుందామె. అనుకున్నదే తడవుగా మంగళవారం జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌లో నామినేషన్ కూడా దాఖలు చేసింది. అయితే ఆమె పోటీ చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది.
సీటీ శ్యామల జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కరీంనగర్‌లో ఉన్న తన ఇంట్లో నుంచి కొడుకు బయటకు గెంటేశాడు. దీంతో ఆమె ప్రస్తుతం జగిత్యాలలో ఉంటున్నారు. తప్పుడు పత్రాలు చూపించి ఇల్లు తనదే అని కొడుకు ఆమెను నడిరోడ్డు మీద పడేశాడు. దీంతో.. ఆమె న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కింది.
కానీ, ఆ కేసులో విచారణ ఆలస్యం అవుతూ వస్తోంది. దీంతో.. మొత్తం వ్యవస్థ మీదే శ్యామల తీవ్ర అసహనానికి గురైంది. అందుకు నిరసనగా జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసింది.
Comments
Please login to add a commentAdd a comment