Jagtial Assembly Constituency
-
జగిత్యాల కాంగ్రెస్‌లో కొత్త చర్చ.. జీవన్‌రెడ్డి ఫొటో ఎక్కడ?
సాక్షి, జగిత్యాల: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష పార్టీల నేతలు హస్తం గూటికి చేరుతున్న నేపథ్యంలో పలు చోట్ల కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాలలో కాంగ్రెస్ రాజకీయం చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఫ్లెక్సీల వార్ ఇంకా కొనసాగుతోంది.తాజాగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఫ్లెక్సీల్లో ఎక్కడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫొటోలు లేకపోవడం స్థానికంగా హాట్ టాపిక్ అయ్యింది. కావాలనే జీవన్ రెడ్డి ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. ఇక.. మొన్న కూడా జీవన్ రెడ్డి ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించిన విషయం తెలిసిందే.మరోవైపు.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య సయోధ్య కుదరడం లేదు. దీంతో, రెండు వర్గాల మధ్య దూరం పెరుగుతోంది. ఈనేపథ్యంలో జగిత్యాల కాంగ్రెస్‌లో అంతర్గత పోరు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. జగిత్యాలలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డిని కావాలనే సైడ్ చేస్తున్నారా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
నాడు మీరు పార్టీలో చేర్చుకోలేదా?.. కేటీఆర్‌కు ఎమ్మెల్యే సంజయ్ కౌంటర్
సాక్షి, జగిత్యాల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అలాగే, తనపై విమర్శలు చేసిన వారే ఏం జరిగిందో ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని కౌంటరిచ్చారు. అలాగే, జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ చేరినట్టు వెల్లడించారు.కాగా, సంజయ్ కుమార్ మంగళవారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. నేను బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు కనీసం ఒక్క కౌన్సిలర్‌గా కూడా లేని పరిస్థితిలో ఉన్నాను. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టడానికి ఎవరూ ముందుకు రాకపోతే మా బంధువులతో కట్టించాను. నన్ను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాను. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను. కేటీఆర్ మాటలు నన్ను బాధించాయి. విమర్శలు చేసిన వారే ఏం జరిగిందో ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి. గతంలో వేరే పార్టీలో గెలిచినవారిని మీరెలా(బీఆర్ఎస్) చేర్చుకోన్నారో ముందు సమాధానం చెప్పాలి. జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం. నేను ఒక డాక్టర్‌ను చాలా కుటుంబాలను పోషించేంత ఆర్థికంగా ఉన్నవాడిని. జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే కాంగ్రెస్‌లో చేరాను. మా కుటుంబం అంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి నడిస్తే అభివృద్ధి సాధ్యమని భావించాను. రైతుల కోసం రుణమాఫీ చేయడానికి ప్రక్రియ ప్రారంభించారు సీఎం రేవంత్. తెలంగాణాలో ఎక్కడా లేని విధంగా జగిత్యాలలో డబుల్ బెడ్ రూమ్స్ కట్టించాం. దీనికి సంబంధించిన డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. సంజయ్ కుమార్ ఇటీవలే సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ బీ-ఫామ్‌తో ఎన్నికల్లో గెలిచిన సంజయ్.. పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే సంజయ్‌పై కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంలో బీఆర్ఎస్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. -
కొడుకుపై కోపంతో 82 ఏళ్ల తల్లి నామినేషన్
జగిత్యాల: ఆమె 82 ఏళ్ళ వృద్ధురాలు .. భర్త స్వాతంత్య్ర సమరయోధుడు.. కుమారుడు విదేశాలకు వెళ్లి వచ్చాడు.. కానీ తల్లికి చెందిన భూమిని ఆమెకు తెలియకుండానే అమ్మేసుకున్నాడు. దాంతో ఆమె అద్దె ఇంట్లో ఉంటూ అష్టకష్టాలు పడుతూ.. న్యాయం చేయాలని ఏకంగా సీఎం కేసీఆర్‌కు సైతం లేఖ రాసింది. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తే పదిమందికీ తెలిసి తన సమస్య పరిష్కారం అవుతుందని ఆ పెద్దావిడ భావించి నామినేషన్ వేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన దివంగత స్వాతంత్య్ర సమరయోధుడు చీటి మురళీధర్ భార్య, 82ఏళ్ల చీటి శ్యామల మంగళవారం జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి తన గోడును వెళ్లబోసుకున్నారు. పెద్ద కుమారుడు శ్రీరామ్ విదేశాలకు వెళ్లి వచ్చి తమకు తెలియకుండానే తమ స్థలాన్ని అమ్ముకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిపై నిరసనగా.. తన సమస్య పరిష్కారం కావాలనే నామినేషన్ వేశానని ఆమె చెప్పుకొచ్చారు. -
ఓ తల్లి అసహనం.. ఎన్నికల్లో నామినేషన్
సాక్షి, జగిత్యాల : జిల్లా పరిధిలో ఓ 80 ఏళ్ల వృద్ధురాలు తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుందామె. అనుకున్నదే తడవుగా మంగళవారం జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో నామినేషన్ కూడా దాఖలు చేసింది. అయితే ఆమె పోటీ చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. సీటీ శ్యామల జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కరీంనగర్లో ఉన్న తన ఇంట్లో నుంచి కొడుకు బయటకు గెంటేశాడు. దీంతో ఆమె ప్రస్తుతం జగిత్యాలలో ఉంటున్నారు. తప్పుడు పత్రాలు చూపించి ఇల్లు తనదే అని కొడుకు ఆమెను నడిరోడ్డు మీద పడేశాడు. దీంతో.. ఆమె న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కింది. కానీ, ఆ కేసులో విచారణ ఆలస్యం అవుతూ వస్తోంది. దీంతో.. మొత్తం వ్యవస్థ మీదే శ్యామల తీవ్ర అసహనానికి గురైంది. అందుకు నిరసనగా జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసింది. -
జగిత్యాల: పథకాలు అమలైనా.. ఫలితం మాత్రం సున్నా..
BRS పార్టీ నుండి 2014లో మాకునూరి సంజయ్ కుమార్ ఓటమి అనంతరం, 2019లో సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిసి కులాలు నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలపై ప్రభావితం పార్టీల పరిస్థితి: బి.ఆర్.ఎస్ పార్టీకి రెబల్స్ బెడద ఉండేలా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి కూడా రెబల్స్ ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఐదుగురు ఆశిస్తున్నారు. ఆశావహులు బీఆర్ఎస్ మాకునూరి సంజయ్ కుమార్ కాంగ్రెస్ తాటిపర్తి జీవనరెడ్డి ( ప్రస్తుత ఎమ్మెల్సీ ) ఆశావహులు తాటిపర్తి విజయలక్ష్మి తాటిపర్తి రాము బీజేపీ: బోగ శ్రావణి (రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు) శైలేందర్ రెడ్డి మధుసూదన్ తిరుపతి రెడ్డి BRS అభ్యర్థి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్లస్‌లు: జగిత్యాల యావర్ రోడ్డు విస్తరణా. సీఎం రిలీఫ్ పండ్, కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఎప్పటికప్పుడు అందించడం, అధిష్టానం సీఎం కేసీఆర్, కెటిఆర్ వద్ద మంచి పేరు ఉండటం. మైనస్‌లు: బీర్పూర్ మండలంలో రోళ్లవాగు నిర్మాణం పూర్తి అయిన ముంపు గ్రామాల బాధితులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం. కులవసంఘ భవనాలు నిర్మాణం జరిగినా.. దళిత బంధుకు అందించడం పార్టీ ప్రజాప్రతినిధులు పనులు పూర్తి చేసిన బిల్లులు రాక పోవటం. తన అనుకూల వర్గానికి పనులు చేయడం, మరో వర్గంపై చిన్న చుపు చూడడం మండల, గ్రామ స్థాయి నాయకులతో, సంబంధాలు అనుకూలంగా లేకపోవడం పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్‌లను అర్హులకు అందిచక పోవటం. -
జగిత్యాల నియోజకవర్గంని పరిపాలించే వారెవరు?
జగిత్యాల నియోజకవర్గం జగిత్యాలలో ఆరుసార్లు విజయం సాదించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి 2018 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు. టిఆర్ఎస్ తరపున పోటీచేసిన డాక్టర్ ఎమ్.సంజయ్ కుమార్ భారీగా 61125 ఓట్ల ఆదిక్యతతో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికలలో గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డి మంచి మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించడం మరో విశేషంగా చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికలలో సంజయ్ కుమార్ కు 104247 ఓట్లు రాగా, జీవన్ రెడ్డికి కేవలం 43062ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ది ముదిగంటి రవీంద్ర రెడ్డికి కేవలం 4700 ఓట్లు మాత్రమే వచ్చాయి. సంజయ్ కుమార్ వెలమ సామాజికవర్గానికి చెందిన నేత.1978 వరకు వెలమ సామాజికవర్గం నేతలు ఇక్కడ అదికంగా ఎమ్మెల్యేలుగా గెలుపొందినా, ఆ తర్వాత అంటే నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈసారే వెలమ నేత గెలిచారు.2014లో కరీంనగర్ జిల్లాలో టిఆర్ఎస్ ప్రభంజనాన్ని ఎదురొడ్డి గెలిచిన ఏకైక నేత జీవన్ రెడ్డి కావడం విశేషం. ఆయన జగిత్యాల నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ది సంజయ్ కుమార్ పై 7828 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. 2018లో మాత్రం జీవన్ రెడ్డి ఓడిపోవల్సి వచ్చింది. జీవన్ రెడ్డి ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో జగిత్యాలలో టిడిపి, బిజెపి కూటమి తరపున పోటీచేసిన తెలుగుదేశం ఎన్నికల ప్రచార కమిటీ అద్యక్షుడు ఎల్.రమణ 22385 ఓట్లతో ఇక్కడ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. 2018లో పోటీచేయలేదు. జగిత్యాల నియోజకవర్గంలో ఏడుసార్లు రెడ్లు ఏడుసార్లు వెలమ, మూడుసార్లు బిసి వర్గం నేతలు, ద్విసభ్య నియోజకవర్గం గా ఉన్నప్పుడు ఒక ఎస్.సి నేత గెలుపొందారు. జీవన్‌రెడ్డి 1983లో టిడిపి పక్షాన తొలిసారి గెలుపొంది ఎన్.టి.ఆర్.క్యాబినెట్లో స్థానం పొందారు. ఆ తరువాత ఆయన నాదెండ్ల భాస్కరరావు పక్షాన చేరారు. అనంతరం కాంగ్రెస్ ఐలో చేరి 1989 నాటికి తిరిగి ఎమ్మెల్యే కాగలిగారు. 1994లో ఓడిపోయినప్పటికి, అప్పుడు గెలిచిన ఎల్.రమణ, 1996లో కరీంనగర్ లోక్‌సభ స్థానానికి ఎన్నికవడంతో జరిగిన ఉప ఎన్నికలో జీవన్‌రెడ్డి విజయం సాధించారు. 1999,2004,2014లలో కూడా నెగ్గారు. వై.ఎస్. క్యాబినెట్లో రహదారులు, భవనాల శాఖమంత్రిగా ఉన్నారు. కరీంనగర్ లోక్‌సభ స్థానంలో కేసిఆర్ రెండుసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు దిగిన సందర్భంలో జీవన్‌రెడ్డే ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచారు. ఒకసారి మంత్రి పదవికి రాజీనామా చేసి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేసి, అతి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ వెంటనే తిరిగి మంత్రి పదవి బాధ్యతలు చేట్టారు. జగిత్యాలకు రెండు ఉప ఎన్నికలతో సహా 17సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి 10సార్లు, టిడిపి నాలుగుసార్లు, పిడిఎఫ్ ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి ఎస్.టి.ఎఫ్. ఒకసారి గెలుపొందాయి. 1967లో కానుగంటి లక్ష్మీనరసింహారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు గెలిచారు. 1952లో ఇక్కడ గెలిచిన బుట్టి రాజాం 57లో సుల్తానాబాద్‌లో, 62లో పెద్దపల్లిలో, 67లోను స్తులాపూర్లో మొత్తం నాలుగుసార్లు విజయం సాధించారు. 1972లో ఇక్కడ గెలుపొందిన వి.జగపతిరావు, 1989లో కరీంనగర్లో ఇండిపెండెంటుగా నెగ్గారు. ఇక్కడ నుంచి గెలిచి మంత్రి పదవి నిర్వహించినవారిలో జీవన్‌రెడ్డితోపాటు, రాజేశంగౌడ్, ఎల్.రమణ కూడా ఉన్నారు. రాజేశంగౌడ్ గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో పనిచేస్తే, రమణ 1995లో చంద్రబాబు క్యాబినెట్లో పనిచేసారు. జగిత్యాల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..