ఎన్నికల్లో ప్రచార వ్యయం వివరాలు సమర్పించాల్సిందే..
వ్యయ పరిశీలనకు ప్రత్యేక అధికారులు
సాక్షి, మంచిర్యాల: ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఆదిలాబాద్‌లో 12 మంది, పెద్దపల్లిలో 42మంది బరిలో ఉన్నారు. ఎ న్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రచారమూ ప్రభావితం చేస్తుంది. ఆ ప్రచార వ్యయం కూడా పె రుగుతూ వస్తోంది. ర్యాలీలు, సభలు, సమావేశాలు, సభలకు జనాలను తరలించే వాహనాలు, భో జనాలు, టెంట్లు ఇలా ప్రతీదానికి అభ్యర్థులు ఖ ర్చు చేయాల్సి వస్తుంది. వీటన్నింటికి కూడా ఎన్నిక ల సంఘం స్థానికంగా ధరలను అనుసరించి చెల్లింపులను నిర్దేశించింది.
ఆ మేరకు వ్యయ వివరాలను అభ్యర్థులు నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాంకులో ఖాతా తెరిచి దాని ద్వారానే చెల్లింపులు చేయా లి. అభ్యర్థులు ప్రచార వ్యయానికి సంబంధించి ప్ర తీ ఖర్చు వివరాలను ఎన్నికలు పూర్తయిన తర్వాత నెల రోజుల్లోగా ఎన్నికల సంఘానికి సమర్పించాలి. లేనిపక్షంలో ఆ తర్వాత జరిగే ఎన్ని కల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తుంది. అలా వేటు పడిన వారిలో రాష్ట్ర వ్యాప్తంగా 107మంది ఉన్నారు.
వ్యయ పరిశీలకులు వీరే..
ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా మహారాష్ట్రకు చెందిన ఐఆర్‌ఎస్ అ« దికారి జాదావార్ వివేకానంద, పెద్దపల్లి నియోజకవర్గానికి సమీర్ నైరంతర్య వ్యవహరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వీరు పర్యటించి రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచార వ్యయాలను పరిశీలిస్తారు.
పెంపు ఇలా..
లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార వ్యయ పరి మితి 1952లో రూ.25వేలుగా ఉండేది. 1971లో రూ.35వేలు ఉండగా.. 1980లో రూ.లక్షకు పెరిగింది. 1984నుంచి 1991వరకు రూ.1.50లక్షలు, 199 6లో రూ.4.50లక్షలకు చేరింది. 1998లో రూ.15లక్షలు, 2004లో రూ.25లక్షలకు పెరుగుతూ వచ్చింది. 2014లో ఎన్నికల ప్రచార వ్యయ పరిమితిపై ప్ర ధాన సవరణ జరిగి రూ.70లక్షలకు పెరిగింది. దీని పై 2020లో 10శాతం పెరిగింది. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీ సూచన మేరకు 2022లో ప్రచార వ్యయ పరిమితిని రూ.95లక్షలకు పెంచా రు. లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గరి ష్టంగా రూ.95లక్షల వరకు ప్రచారానికి ఖర్చు చేసే అవకాశం ఉంది.
107మంది పోటీకి అనర్హులు..
రాష్ట్రంలోని 107మందిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ప్రచార వ్య యానికి సంబంధించిన వివరాలు సమర్పించకపోవడంతో ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 10ఏ ప్రకారం అనర్హత వేటు వేసింది. వీరిలో అత్యధి కంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన 68 మంది ఉ న్నారు. అప్పట్లో పసుపు రైతులు భారీ సంఖ్యలో నామినేషన్ వేసిన వారే కావడం గమనార్హం.
వచ్చే జూన్ 23 వరకు వీరు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలోని 2, మహబూబాబాద్, మెదక్‌లో ఒక్కొక్కరు ఉండగా.. వీరిపై జూన్ 10వరకు వేటు కొనసాగుతుంది. జుక్కల్, రామగుండం, కరీంనగర్, గజ్వేల్, మల్కాజ్‌గిరి, నాగార్జునసాగర్, ఆలేరు, జనగాం, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరు, దేవరకొండ 5, మిర్యాలగూడ, పాలకుర్తి ముగ్గురు చొప్పున, నల్గొండ, ములుగు 4 చొప్పున, నకిరేకల్ 2, మల్కాజ్‌గిరి ఒకరిపై జూలై 14వరకు వేటు వేసింది. పాలకుర్తిలో ముగ్గురిపై ఆగస్టు 25వరకు, డోర్నకల్ ఒకరిపై సెప్టెంబర్ 21వరకు అనర్హత వేటు పడింది.
ఇవి చదవండి: దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం.. : మంత్రి సీతక్క
Comments
Please login to add a commentAdd a comment