సాక్షి, చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం తమిళ హీరో విశాల్, దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప, బీజేపీ అభ్యర్థి నాగరాజన్ నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు దాదాపు 40 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ దాఖలుచేయడానికి ముందు హీరో విశాల్ సోమవారం దివంగత ముఖ్యమంత్రులు కామరాజర్, ఎంజీఆర్ స్మారక మందిరాల్లో నివాళులర్పించారు. మెరీనా బీచ్‌లోని జయ సమాధి వద్ద అంజలి ఘటించారు.
తాను రాజకీయ నాయకుడిని కాదని, ప్రజల ప్రతినిధిగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ నియోజవకర్గంలో దాదాపు లక్ష మంది తెలుగు ఓటర్లు ఉండటంతో, విశాల్ వారి ఓట్లే లక్ష్యంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విశాల్‌కు మద్దతుగా నటుడు ఆర్య, ప్రకాష్‌రాజ్ కదిలారు. తనకు మద్దతుగా సినీ పరిశ్రమ కదిలిరావాలని పిలుపునిచ్చారు. దాదాపు 70 మంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీకి దిగడంతో ఉపసమరం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment