14న ప్రధాని మోదీ నామినేషన్‌? | PM Modi Will Take Nomination In Pushya Nakshatra On 14th May, Details Inside| Sakshi
Sakshi News home page

14న ప్రధాని మోదీ నామినేషన్‌?

Published Sun, May 12 2024 7:36 AM | Last Updated on Sun, May 12 2024 3:09 PM

PM Modi will Enroll in Pushya Nakshatra

దేశంలో ప్రస్తుతం ఏడు దశల్లో లోక్‌సభ ఎ‍న్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మే 14న తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అభిజిత్ ముహూర్తంలో ప్రధాని తన నామినేషన్‌ పత్రాలను సంబంధిత అధికారులకు అందించనున్నారు. అయోధ్య రామ మందిర శంకుస్థాపనకు ముహూర్తాన్ని అందించిన పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ తాజాగా ప్రధాని మోదీ నామినేషన్‌ దాఖలుకు ముహూర్తాన్ని నిర్ణయించారు.

మే 14న గంగా సప్తమి. ఆరోజు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఆ రోజున నామినేషన్ దాఖలు చేయడం శ్రేయస్కరమని పండితులు ప్రధాని మోదీకి సూచించారు. గంగా సప్తమి రోజున బ్రహ్మదేవుని కమండలంలో నుంచి గంగ జన్మించిందని చెబుతారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం మే 13న ప్రధాని మోదీ వారణాసిలో రోడ్ షో నిర్వహించనున్నారు.  ఆ మర్నాడు అంటే మే 14న ప్రధాని నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందు మోదీ గంగామాతకు పూజలు నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమాలను సంబంధించిన షెడ్యూల్‌ ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement