గజ్వేల్: రజాకార్లకు సీఎం కేసీఆర్ వారసుడని, బీఆర్‌ఎస్ అవినీతి పాలనకు గజ్వేల్ నుంచే పాతరేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలు పునిచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ వేశా రు. ఈ సందర్భంగా పట్టణంలోని కోటమైసమ్మ ఆలయం వద్ద నుంచి ఇందిరాపార్కు మీదుగా ఐఓసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన రోడ్ షోలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరుల ఆత్మకు శాంతి చేకూరాలంటే బీఆర్‌ఎస్ పాలనకు చరమగీతం పాడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి నేరుగా సీఎం ఫామ్‌హౌస్‌కే నీరు వస్తుండగా ప్రజలకు మాత్రం చుక్క నీరందడం లేదన్నారు. నియోజకవర్గంలోని 30వేల కుటుంబాలకు చెందిన భూములను లాక్కొని, ఆ కుటుంబాలను కేసీఆర్ రోడ్డున పడేశారని ఆరోపించారు. గజ్వేల్‌లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోగా, ఉన్న ఇండ్లను కూలగొట్టారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు వదిలిన బాణమే ఈటల
ఈ ఎన్నికల్లో గజ్వేల్లోనే కాదు కామారెడ్డిలోనూ కేసీఆర్‌కు ఓటమి తప్పదని కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణకు వదిలిన బాణమే ఈటల రాజేందర్ అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీసీ నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గజ్వేల్‌కు కేసీఆర్ పరాయి వ్యక్తి అని, తాను కాదని చెప్పారు. తానూ 1992 నుంచి ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ నడపానని, అప్పటినుంచి తనకు ఈ ప్రాంతంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధంగా ఈటల అభివర్ణించారు.
గజ్వేల్ రోడ్‌షోలో ప్రసంగిస్తున్న కిషన్‌రెడ్డి. చిత్రంలో ఈటల
Comments
Please login to add a commentAdd a comment