
అనంతపురం పార్లమెంట్ స్థానానికి బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తున్న రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీరపాండియన్
సాక్షి,అనంతపురం అర్బన్: నామినేషన్ల ఉపసంహరణ గురువారం ముగిసింది. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసి ఆమోదం పొందిన 23 మంది అభ్యర్థుల్లో ఒక్కరూ తమ నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. ఇక 14 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసి ఆమోదం పొందిన 199 మంది అభ్యర్థుల్లో బుధవారం ఆరుగురు, గురువారం 29 మంది.. మొత్తంగా 35 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరకు అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గానికి 14 మంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో నిలవగా.. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి 9 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక 14 అసెంబ్లీ నియోజవకర్గాలకు 164 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అత్యధికంగా ఉరవకొండ, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, ధర్మవరం నియోజవర్గాల్లో 15 మంది చొప్పున ఎన్నికల బరిలో ఉన్నారు. అత్యల్పంగా మడకశిర నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
అదనపు ఈవీఎంల అవసరం లేదు
ఒక ఈవీఎంలో 16 మంది అభ్యర్థులకు స్థానం ఉంటుంది. అయితే జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో 15 మంది అభ్యర్థులు, మిగిలిన నియోజకవర్గాల్లో 15 కంటే తక్కువ మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ లెక్కనñ జిల్లాలోని 14 నియోజవర్గాల్లోనూ అదనపు ఈవీఎంల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు.
పార్లమెంట్ స్థానాలకు బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు
అనంతపురం పార్లమెంట్: తలారి రంగయ్య (వైఎస్సార్‌సీపీ), జేసీ పవన్‌రెడ్డి (టీడీపీ), డి.జగదీశ్ (సీపీఐ), హంస దేవినేని (బీజేపీ), కె.రాజీవ్‌రెడ్డి (కాంగ్రెస్), జి.లలిత (ఎస్‌యుసీఐ)
హిందూపురం పార్లమెంట్: గోరంట్ల మాధవ్ (వైఎస్సార్‌సీపీ), నిమ్మల కిష్టప్ప (టీడీపీ), ఎం.ఎస్.పార్థసారథి (బీజేపీ), కె.టి.శ్రీధర్ (కాంగ్రెస్)
స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు ఆయా పార్లమెంట్ల రిటర్నింగ్ అధికారులు కలెక్టర్ జి.వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు గుర్తులు కేటాయించారు.
అసెంబ్లీ స్థానాలకు పోటీ ఇలా..
నియోజకవర్గం | బరిలో అభ్యర్థులు |
రాయదుర్గం | 11 |
ఉరవకొండ | 15 |
గుంతకల్ | 12 |
శింగనమల | 9 |
అనంతపురం | 12 |
కళ్యాణదుర్గం | 15 |
రాప్తాడు | 10 |
మడకశిర | 7 |
హిందూపురం | 11 |
పెనుకొండ | 11 |
పుట్టపర్తి | 15 |
ధర్మవరం | 15 |
కదిరి | 11 |
Comments
Please login to add a commentAdd a comment