
అమృత్‌సర్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్‌సర్ తూర్పు నుంచి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ నగరానికి కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉందని, అది కొనసాగుతుందని, ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ గెలుపు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. శిరోమణి అకాళీదళ్ నేత మజీతియా అమృత్‌సర్ తూర్పు నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసినా.. మజీతాను మాత్రం వీడటం లేదని వ్యంగాస్త్రాలు విసిరారు.
ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకం ఉంటే మజీతాను వీడి, తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. పంజాబ్ రాష్ట్రాన్ని నాశనం చేసిందే అకాళీదల్ అని సిద్ధూ ఆరోపించారు. తనను గెలవనివ్వబోనన్న అమరీందర్ సింగ్ వ్యాఖ్యలపై స్పందించిన సిద్ధూ... ఆయనకు దమ్ముంటే పటియాలాను వీడి తనపై పోటీ చేయాలని సవాలు విసిరారు. 30 ఏళ్ల క్రితం మరణించిన తన తల్లి ప్రస్తావన తెచ్చిన తన ప్రత్యర్థులపై ఆయన మండిపడ్డారు. వారు నీచ రాజకీయాలు చేస్తున్నారన్న సిద్ధూ... ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment