Amritsar East
-
నామినేషన్ దాఖలు చేసిన సిద్ధూ
అమృత్సర్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్సర్ తూర్పు నుంచి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ నగరానికి కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉందని, అది కొనసాగుతుందని, ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ గెలుపు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. శిరోమణి అకాళీదళ్ నేత మజీతియా అమృత్సర్ తూర్పు నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసినా.. మజీతాను మాత్రం వీడటం లేదని వ్యంగాస్త్రాలు విసిరారు. ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకం ఉంటే మజీతాను వీడి, తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. పంజాబ్ రాష్ట్రాన్ని నాశనం చేసిందే అకాళీదల్ అని సిద్ధూ ఆరోపించారు. తనను గెలవనివ్వబోనన్న అమరీందర్ సింగ్ వ్యాఖ్యలపై స్పందించిన సిద్ధూ... ఆయనకు దమ్ముంటే పటియాలాను వీడి తనపై పోటీ చేయాలని సవాలు విసిరారు. 30 ఏళ్ల క్రితం మరణించిన తన తల్లి ప్రస్తావన తెచ్చిన తన ప్రత్యర్థులపై ఆయన మండిపడ్డారు. వారు నీచ రాజకీయాలు చేస్తున్నారన్న సిద్ధూ... ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. -
ఆ స్థానం నుంచే మా ఆయన పోటీ: సిద్ధు భార్య
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు. అమృత్సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేసే అవకాశముందని ఆయన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధు బుధవారం మీడియాకు తెలిపారు. 'మా ఆయన అమృత్ సర్ ఈస్ట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశముంది' అని ఆమె పేర్కొన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్ధు, ఆయన భార్య గత ఏడాది బీజేపీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సిద్ధు భార్య కౌర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్ధు కూడా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశముందని తెలుస్తోంది. 2012 ఎన్నికల్లో సిధ్దు పటియాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో అమృత్సర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. తనను పంజాబ్‌కు దూరం పెట్టాలనే కుట్రతో బీజేపీ వ్యవహరిస్తున్నదని, అందుకే ఆ పార్టీకి రాంరాం చెప్పినట్టు సిద్ధు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.