
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థిగా చండూర్‌లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి వెంట వివేక్ వెంకటస్వామి, కపిలవాయి దిలీప్ కుమార్, రాజేశ్వర్ రెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి ఉన్నారు.