మునుగోడు ర్యాలీలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి, ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ వివేక్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక వల్ల ప్రజలకు, పార్టీకి అంతా మంచే జరుగుతోందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకొనే క్రమంలో ఆయన చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించడం ద్వారా ప్రస్తుతం మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్నే నియోజకవర్గానికి రప్పించగలిగామని.. ఇది తమ ఘనత అని చెబుతున్నారు.
మూడున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధిని రాజగోపాల్‌రెడ్డి పట్టించుకోలేదన్న వాదనతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగా ఆయన చేసిన రాజీనామా వల్ల మునుగోడు ప్రజలకు ఒరిగేదేమీ ఉండదంటూ అధికార టీఆర్‌ఎస్ చేసిన విమర్శలను గత 2–3 నెలలుగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, ఇస్తున్న హామీల ద్వారానే తిప్పికొట్టగలిగామనే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట మినహా మిగతా అసెంబ్లీ స్థానాలను ముఖ్యంగా విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధిలో ప్రభుత్వం ఇప్పటిదాకా చూపిన వివక్షను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగామని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ అంశంపై బీజేపీ నేతలు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇవీ...
- రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశాక మునుగోడులో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పనులకు మోక్షం
- మునుగోడును దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్, చండూరును దత్తత తీసుకుంటానని మంత్రి ఎర్రబెల్లి ప్రకటన.
- కొత్తగా గట్టుప్పుల్ మండలం ఏర్పాటు.
- దండుమల్కాపురం బాధితులకు ఇళ్ల పట్టాలు ఇస్తానని మంత్రి కేటీఆర్ హామీ
- కొత్తగా అర్హులైన వేలాది మందికి ఆసరా పింఛన్లు, భారీ స్థాయిలో కొత్త రేషన్ కార్డుల మంజూరు.
- రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పథకం కింద గొల్ల కురుమలకు నిధులు.
- ఒక్కొక్కరికీ రూ. 1.53 లక్షల నగదు విడుదల.
- ఒక్క మునుగోడులోనే రూ. 7,600 మంది గొల్ల కురుమలకు బ్యాంకు ఖాతాల్లో రూ. 93 కోట్లు జమ.
- చౌటుప్పల్–నారాయణపూర్ రోడ్డు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి.
- చర్లగూడెం, లక్ష్మణాపురం బాధితులకు నష్టపరిహారం చెల్లింపు
(చదవండి: మైక్ కట్.. మునుగోడులో ప్రచారానికి నేటితో తెర)
Comments
Please login to add a commentAdd a comment