మునుగోడు ఓటమిపై సమగ్ర అధ్యయనం  | CLP Leader Mallu Bhatti Vikramarka Lashes Out TRS BJP | Sakshi
Sakshi News home page

మునుగోడు ఓటమిపై సమగ్ర అధ్యయనం 

Published Mon, Nov 14 2022 2:59 AM | Last Updated on Mon, Nov 14 2022 2:59 AM

CLP Leader Mallu Bhatti Vikramarka Lashes Out TRS BJP - Sakshi

ఎర్రుపాలెం: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటమిపై సమగ్ర విశ్లేషణతో అధ్యయనం చేస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడులో విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీ అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా మద్యం, నగదు పంపిణీ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని విమర్శించారు.  

రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో అద్భుతంగా సా గిందని, అన్ని వర్గాల ప్రజలతో ఆయన మమేకమయ్యారని తెలిపారు. అందరి చేతుల్లో ఉండాల్సిన దేశ సంపదను కేవలం అంబానీ, ఆదాని లాంటి పెట్టుబడిదారులకు మోదీ పంపిణీ చేస్తున్నారని భట్టి ఆరోపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement