సాక్షి, నల్లగొండ: మునుగోడు అభివృద్ధిపై రాజగోపాల్‌రెడ్డి చేసిన సవాల్‌పై సీఎం కేసీఆర్ స్పందించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లలో మునుగోడుకు ఏం చేశారని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని బీజేపీ క్యాంపు కార్యాలయంలో బండి సంజయ్ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'దుకాణం మూతపడే ప్రమాదం ఉందని కేసీఆర్ బయపడుతున్నారు. చండూరు మీటింగ్ ఒక టైమ్ పాస్ మీటింగ్. బహిరంగ సభను చూసి ప్రజలు నవ్వుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎనిమిదేళ్లలో మునుగోడుకు ఏం చేశారో చెప్పాలి. ఎన్ని నిధులు ఇచ్చారు అనేది సభా వేదిక ద్వారా తెలపాలి. అభివృద్ధిపై చర్చ జరగాలి. నియోజకవర్గ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తున్నారనే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు.
అభివృద్ధిపై ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలను ఏం అమలు చేశావో చెప్పాలి. నీ అభ్యర్థిని పార్టీ ప్రచారానికి తీసుకెళ్లాలంటే అవమానంగా ఎందుకు భావిస్తున్నారు. ఇవాళ బహిరంగ సభ వేదికపై కేసీఆర్ ఏడ్వబోతున్నారు. ఏడ్చి సింపథీని పొందాలని చూస్తున్నాడు. కేసీఆర్ నటించేవాడు కాదు జీవించేవాడు. ఇవాళ జరిగే బహిరంగ సభే సీఎం కేసీఆర్ రాజకీయ జీవితానికి సమాధి' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment