సాక్షి, కరీంనగర్: నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఎక్కడున్నావ్? బయటకు రా.. వాస్తవాలు జనానికి చెప్పు అంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మొన్న కాళేశ్వరంలో మోటార్లు మునిగాయి. నేడు ప్రాజెక్టు కుంగిపోయింది. నువ్వే కదా కేసీఆర్ ప్రాజెక్టుకు ఇంజనీర్ అని చెప్పుకున్నది. జాతీయ హోదా ఇస్తే మా పరువు పోయేది. కేసీఆర్ తీరుతో దేశంలో తెలంగాణ నవ్వుల పాలైంది. కమీషన్ల కోసం కుక్కుర్తి పడ్డారు’’ అని ధ్వజమెత్తారు.
ప్రాజెక్టు నిర్మాణమంతా లోపాలే: ఈటల రాజేందర్
హైదరాబాద్: కేసీఆర్ ప్రజా సమస్యలను పట్టించుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.. సోమవారం ఆయన హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ‘‘కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ప్రాజెక్టు నిర్మాణమంతా లోపాలే. కేవలం తప్పిదాల వల్లే మేడిగడ్డ బ్యారేజ్‌కు ఈ పరిస్థితి వచ్చింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ వేల కోట్లు దండుకున్నారు. లక్ష కోట్లు ఖర్చు చేశామంటూ కబుర్లు చెబుతున్నారు. ప్రాజెక్టుల దగ్గర 144 సెక్షన్ ఎందుకు పెట్టారు’’ అంటూ ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
చదవండి: కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీపై కేంద్రం ఆందోళన.. ఆరుగురు నిపుణులతో కమిటీ
Comments
Please login to add a commentAdd a comment