సూర్యాపేట : బీఆర్‌ఎస్ సూర్యాపేటఅభ్యర్థి, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గురువారం వేసిన నామినేషన్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం రూ.1.58 కోట్ల స్థిర ఆస్తులు, రూ.2.68 కోట్ల చరాస్తులు మొత్తం కలిపి రూ.4.26 కోట్లు ఉన్నాయని.. రూ.2.60 లక్షల అప్పు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన చేతిలో రూ.2.86 లక్షలు ఉన్నట్లు తెలిపారు.
తన సతీమణి సునీత చేతిలో రూ.9.8 లక్షలు ఉండగా.. ఆమె పేరున రూ.5.94 కోట్ల స్థిరాస్తులు, రూ.4.66 కోట్ల చరాస్తులు, 500 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని.. రూ.3.27 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు. ఆయన పేరున ఒక కారు, తన సతీమణి పేరున రెండు కార్లు, ఒక బైక్, ట్రాక్టర్ ఉన్నట్లు చూపారు. తనపై ఒక కేసు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు.
సంకినేని కుటుంబ ఆస్తి రూ.రూ.22.63 కోట్లు
సూర్యాపేట : బీజేపీ అభ్యర్ధి సంకినేని వెంకటేశ్వర్‌రావు ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను రూ.22.63 కోట్లుగా చూపారు. వెంకటేశ్వర్‌రావు పేరున రూ.1.51 కోట్ల చరాస్తులు, రూ.40 లక్షల స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అప్పులు రూ.1.50 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన సతీమణి లక్ష్మి చేతిలో రూ.13.75 లక్షలు ఉండగా.. 730 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.25.32 కోట్ల చరాస్తులు ఉన్నట్లు చూపారు. తనపై నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు.
దామోదర్‌రెడ్డిపై నాలుగు కేసులు..
సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి రూ.13.94 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.88 కోట్ల స్థిరాస్తులు తన చేతిలో రూ.25 వేలు ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై నాలుగు పెండింగ్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment