బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. మొత్తం ఆస్తుల విలువ రూ.1,139 కోట్లు అని తెలిపారు. అలాగే తనకు రూ.263 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. 2018తో పోల్చితే ఈసారి ఆస్తుల విలువ 67 శాతానికిపైగా పెరగడం గమనార్హం. ఇప్పటివరకు అఫిడవిట్ సమర్పించిన కాంగ్రెస్ నేతల్లో డీకే దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.
తన వద్ద ఓ కారు, రెండు ఖరీదైన వాచ్‌లు, 2 కేజీల బంగారం, 12 కేజీల వెండి ఉన్నట్లు కన్నడ పీసీసీ చీఫ్ వెల్లడించారు. అలాగే తనపై 19 కేసులు ఉన్నాయని అఫిడవిట్‌లో తెలిపారు. వీటిలో 13 కేసులు గత మూడేళ్లలోనే నమోదైనట్లు పేర్కొన్నారు.
కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న షాజియా తర్రానుమ్ తన ఆస్తుల విలువ రూ.1,629 కోట్లు అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈయన తర్వాత రెండో స్థానంలో బీజేపీ నేత ఎంటీబీ నాగరాజ్ ఉన్నారు. ఈయన ఆస్తుల విలువ రూ.1,607 కోట్లు అని తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో మే 10న జరగనుంది. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీయూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో విజయం మాదే అని కాంగ్రెస్ దృఢ విశ్వాసంతో ఉంది. మరోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ నమ్మకంగా చెబుతోంది.
చదవండి: లింగాయత్ పవర్.. కన్నడనాట వారి ఓట్లే కీలకం.. ఒకప్పుడు కాంగ్రెస్ వైపు.
Comments
Please login to add a commentAdd a comment