
జమున నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన అరవింద్ భిక్షపతి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య ఈటల జమున హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం మధ్యా హ్నం తన అనుచరుడు అరవింద్ భిక్షపతి ద్వారా ఆర్డీవో కార్యాలయానికి నామినేషన్ పత్రాలను పంపారు. తాను బీజేపీ నుంచి గానీ లేదా ఇండిపెండెంట్‌గా గానీ పోటీ చేస్తానని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నామినేషన్ సందర్భంగా జమున తన ఆస్తులు, తన భర్త ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించారు. దంపతులకు కలిపి మొత్తం రూ.73.12 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలిపారు.
అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులివీ.. చరాస్తులు..
►జమున చేతిలో ఉన్న సొమ్ము రూ. 1,50,000.. రాజేందర్ వద్ద రూ. లక్ష
►కెనరా బ్యాంకులో రూ.4.33 లక్షలు సేవింగ్స్, రూ.58.84 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్, ఐసీఐసీఐ బ్యాంకులో రూ. 43 వేలు సేవింగ్స్. ఎలక్ట్రిసిటీ డిపాజిట్ కింద రూ.89,404 ఉన్నాయి.
►మ్యూచువల్ ఫండ్స్‌లో రూ. 20,10, 633, జమునా హ్యాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కింద రూ.1.05 కోట్ల షేర్లు. అభ య డెవలపర్స్ రూ.43.90 లక్షలు, నార్త్ ఈస్ట్ ప్రాజెక్ట్స్ రూ.2.06 కోట్లు, ఎస్వీఎస్ అర్చవన్‌లో రూ.4,15,137.
►రూ.16,44 లక్షల విలువైన ఇన్నోవా కారు, రూ.20.80 లక్షల విలువైన హోండా కారు, రూ.12.21 లక్షల విలువైన ఇన్నోవా క్రిస్టా కారు, రూ.50 లక్షల విలువైన కిలోన్నర బంగారం. కలిపి మొత్తంగా రూ. 28,68,21,894 విలువైన చరాస్తులు ఉన్నాయి.
►ఈటల రాజేందర్‌కు ఎస్బీఐలో రూ. 20,097 సేవింగ్స్ ఉన్నాయి. మొత్తంగా రూ.6,20,097 లక్షల చరాస్తులు కలిగి ఉన్నట్టు అఫిడవిట్‌లో చూపారు.
►2019–20లో జమునకు రూ.1,33, 40,372, రాజేందర్‌కు రూ.30,16, 592 ఆదాయం వచ్చినట్టు చూపారు.
స్థిరాస్తులు..: జమున పేరిట రూ.7.23 కోట్లు, రాజేందర్ పేరిట రూ.60లక్షల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో తెలిపారు.
►జమున డెవలప్‌మెంట్ ప్రాపర్టీ రూ.1.56 కోట్లు, ఈటల రాజేందర్ పేరిట రూ.7.70 కోట్లు.
►జమున ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ రూ.14.78 కోట్లు, రాజేందర్ ఆస్తుల విలువ రూ.12.50 కోట్లు (తనకు దేవరయాంజాల్, శామీర్‌పేటలో పౌల్ట్రీఫారాలు, గోదాములు, వ్యవసాయ స్థలాలు ఉన్నట్లు పేర్కొన్నారు.)
►అభ్యర్థిగా తనకు రూ.4.89 కోట్లు రుణాలు, రాజేందర్‌కు రూ.3.62 కోట్లు లోన్లు ఉన్నట్టు తెలిపారు.
రెండోరోజు ఐదు నామినేషన్లు
హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం సోమ వారం మరో ముగ్గురు అభ్యర్థులకు సం బంధించి ఐదు నామినేషన్లు దాఖలయ్యా యి. ఈటల భార్య జమున ఒకటి, సిలి వేరు శ్రీకాంత్ అనే స్వతంత్ర అభ్యర్థి రెం డు సెట్లు, నల్లగొండ జిల్లా కట్టంగూరుకు చెందిన రేకల సైదులు రెండు సెట్ల నామినేషన్లు వేశారు. హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు వచ్చినా.. సాంకేతిక కారణాలతో వారి నామినేషన్లను స్వీకరించలేదు.
మరోవైపు పెద్ద సంఖ్యలో ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా నామినేషన్లు వేసేందుకు హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. వారికి స్థానికంగా మద్దతిచ్చే 10 మంది లేకపోవడంతో స్వీకరించలేదు. ఈ సందర్భంగా ఆర్డీవో ఆఫీసు వద్ద ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment