
అంతకుముందు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న ముఖ్యమంత్రి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం పులివెందుల అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం గురువారం ఉదయం 7.45 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్ జిల్లా పులివెందులకు చేరుకుంటారు.
స్థానిక సీఎస్‌ఐ చర్చి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత భాకరాపురంలోని తన నివాసానికి వెళ్తారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.