పవన్ కల్యాణ్ ప్రకటన చాలా ఆశ్చర్యంగా, విచిత్రంగా ఉంది.. పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లింది.. బీజేపీ బలపడాలని వారికే చెప్పడానికా..? అసలు పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఎవరి కోసం..? ఎందుకోసం..? ఆయన సాధించిందేంటీ..?. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. దేశంలోనే అత్యంత బలమైన రాజకీయ పార్టీ బీజేపీ. ఏపీలో బలహీనంగా ఉండొచ్చు.. కానీ పవన్ కల్యాణ్ లాంటి బలహీనుడి దగ్గర సలహాలు అయితే తీసుకోదు కదా..!
జనసేన స్థాపించి పదేళ్లైనా.. టీడీపీ జెండాలు మోయడానికి, చంద్రబాబు మౌత్ పీస్‌గానే పని చేస్తుందని ప్రజలకు తెలియనిది కాదు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జెండా ఉన్నా.. అద్దెకివ్వడానికే.. అజెండాలేని.. సిద్దాంతాలు ఏమాత్రం లేని పార్టీ జనసేన.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చంద్రబాబు లైన్‌ను వినిపించడానికి బీజేపీ పెద్దల అపాయింట్‌మెంట్ కోసం పవన్ కల్యాణ్ 48 గంటలు వేచి చూడాల్సి వచ్చింది. నడ్డాతో భేటీ తరువాత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ బాడీ లాంగ్వేజ్ చూస్తే విశాఖపట్నంలో ప్రధాని మోదీ క్లాస్ పీకినట్లు కనిపించిన లాంగ్వేజ్‌నే కనిపించింది. నడ్డా కూడా పవన్ కల్యాణ్‌కు క్లాస్ పీకి ఉంటాడని పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ బాడీ లాంగ్వేజ్‌నే చెబుతోంది. ఏపీలో ఏమాత్రం బలంలేని జనసేన. బలపడాలని బీజేపీకి సూచించానని.. పవన్ చెప్పడం నమ్మశక్యంగా లేదు.
చదవండి: యెల్లో బ్యాచ్ డ్రామాకు సీఎం జగన్ చెక్
టీడీపీతో పొత్తు ప్రసక్తేలేదని నడ్డా.. పవన్ ముఖం మీద చెప్పడం వల్లనే.. పొత్తుల గురించి చర్చించలేదని.. పవన్ కల్యాణ్ మీడియా ముందు అబద్ధం చెప్పినట్లు అర్థం చేసుకోవచ్చు. పవన్ కల్యాణ్ అజెండా క్లియర్.. టీడీపీ - జనసేన పొత్తులోకి బీజేపీని లాగి.. 2014లా 2024లో పోటీ చేయాలనేది పవన్ ఉబలాటం. కానీ...చంద్రబాబును బీజేపీ అధిష్టానం నమ్మే పరిస్థితి లేదు. అందుకే.. హెచ్చరికలతోపాటు.. హితోపదేశం బీజేపీ పెద్దలు చేస్తున్నా.. పవర్ లెస్ స్టార్ చెవికెక్కడం లేదు. చంద్రబాబు లైన్‌లో ఢిల్లీ వెళ్లిన పవన్.. చివరకు మీడియాతో అబద్ధాలు చెప్పి.. బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
Comments
Please login to add a commentAdd a comment