పవన్‌కు మంత్రి అంబటి స్ట్రాంగ్‌ కౌంటర్‌ | Ambati Rambabu political Counter To Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌కు మంత్రి అంబటి స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published Sat, Jul 1 2023 12:15 PM | Last Updated on Sat, Jul 1 2023 2:47 PM

Ambati Rambabu political Counter To Pawan Kalyan - Sakshi

సాక్షి, గుంటూరు: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు సీరియస్‌ అయ్యారు. భీమవరంలో పవన్‌ కల్యాణ్‌ రౌడీలా మాట్లాడాడు. పవన్‌ పిచ్చికుక్కలా స్వైరవిహారం చేశాడంటూ కామెంట్స్ చేశారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అంటూ కౌంటర్‌ ఇచ్చారు. 

కాగా, మంత్రి అంబటి రాంబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నా కొడకల్లారా అనే పదాన్ని ఉపయోగించిన పవన్‌.. రాజకీయాల్లో చీడపురుగు. పవన్‌ మాట్లాడే బూతులు అన్నీ పాలసీనా. ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్‌ ఎవరి జెండా ఎగరేస్తారో చెప్పాలి. పవన్‌ కల్యాణ్‌ కులాలను రెచ్చగొడుతున్నారు. కాపులందరినీ బాబు చంక ఎక్కించాలనే పవన్‌ చూస్తున్నాడు. చంద్రబాబు రావాలనేది పవన్‌ లక్ష్యం. పెత్తందార్ల పల్లకిని మోస్తున్న వ్యక్తి పవన్‌. విజయం లేని, రాని రాజకీయ పార్టీ జనసేన. జనసేన వారాహి విజయ యాత్ర పేరులో మాత్రమే విజయం ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేసే అధికారంలోకి వస్తారా? అని ప్రశ్నించారు. కేవలం డబ్బు కోసమే పవన్‌ ఆడే నాటకమని జనసైనికులు తెలుసుకోవాలి అని హితవు పలికారు. 

ఇది కూడా చదవండి: మహనీయుల పేర్లు ఉచ్చరించే అర్హత పవన్‌కు ఉందా?: గ్రంధి శ్రీనివాస్‌ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement