నేతలకు సమస్యల నివేదన
– టీడీపీ సర్కారుపై ప్రజాగ్రహం
– గడప గడపకు వైఎస్సార్ సీపీకి ఆదరణ
– పార్టీ నేతలకు సమస్యలు విన్నవిస్తున్న పేదలు
– ఆదుకుంటామని
అభయమిస్తున్న నాయకులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అర్హత ఉన్నా పింఛన్లు అందక వృద్ధులు.. మాఫీ అవుతాయనుకున్న రుణాలు చెల్లించలేక రైతులు.. పూరి గుడెసెలో నివాసం ఉంటున్నాం పక్కా ఇళ్లు మంజూరు కాలేదని పేదలు.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. గడప గడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో భాగంగా తమ ఇళ్లకు వచ్చిన ఆ పార్టీ నాయకులకు ప్రజలు తమ సమస్యలు ఏకరువు పెడుతున్నారు. కనికరం లేని టీడీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్న అభాగ్యులకు నాయకులు ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు. 12 రోజు కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలుకరించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు పలికి చంద్రబాబు అరాచక పాలనకు చరమ గీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ జగ¯Œæమోహ¯Œæరెడ్డిని సీఎం చేయడం ద్వారా రాజన్న పాలన తిరిగి తెచ్చుకుందామని చెప్పారు.
మార్కాపురం మండలంలోని తిప్పాయిపాలెంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పర్యటించగా.. వేటపాలెం మండలం దేశాయిపేటలో చీరాల నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ, బాపట్ల పార్లమెంట్ ఇన్‌చార్జి వరికూటి అమృతపాణిలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకొల్లు మండలం కొణికిలో పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్, మర్రిపూడి మండలం వల్లాయిపాలెం గ్రామంలో నిర్వహించిన గడప గడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు పాల్గొన్నారు. కంభం మండలం రావిపాడులో గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి పర్యటించారు.