పదో రోజు గడప గడపకు వైఎస్సార్‌సీపీ | succesful 10th day | Sakshi
Sakshi News home page

పదో రోజు గడప గడపకు వైఎస్సార్‌సీపీ

Published Mon, Jul 18 2016 3:39 PM | Last Updated on Mon, Sep 4 2017 5:16 AM

పదో రోజు గడప గడపకు వైఎస్సార్‌సీపీ

పదో రోజు గడప గడపకు వైఎస్సార్‌సీపీ

 
పెద్ద ఎత్తున ప్రజల స్వాగతం
 
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:   
జిల్లాలో పదో రోజు గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన  వైఎస్సార్‌సీపీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. నేతలకు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమం నిర్వహించారు. 
స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ప్రజాసమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. టీడీపీ ప్రభుత్వం అర్హులకు పింఛన్లు, రేషన్‌ కార్డులు, సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. మార్కాపురం మండలం శివరాంపురం, అమ్మవారిపల్లె గ్రామాల్లో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు గడపగడపకు వైఎస్సార్‌ సీపీ కార్యక్రమం నిర్వహించారు.  చీరాల నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ, బాపట్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జి వరికూటి అమృతపాణి వేటపాలెం మండలం జీవరక్షనగర్‌లో గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండపి నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు మర్రిపూడి మండలం యామవరం గ్రామంలో గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement