ఎన్నికల హామీలను నెరవేర్చాలి : కోటంరెడ్డి
నెల్లూరు: ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్తవెల్లంటి, పాతవెల్లంటి, కం దమూరు, ఉప్పుటూరు, తదితర గ్రామాల్లో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటుతున్నా, హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని వివరించారు. హామీలను ప్రభుత్వం నెరవేర్చిందా, లేదా అనే అంశంపై ప్రజలే తీర్పునివ్వాలని చెప్పారు. అనంతరం విజయకుమార్‌రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ పాలనపై ప్రజాబ్యాలెట్‌ను పార్టీ నిర్వహిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి అన్ని విధాలుగా అండగా ఉండి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం ప్రజాబ్యాలెట్ పత్రాలను అందజేశారు. పార్టీ నాయకుడు చేవూరి ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.