
ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి
సాక్షి, నెల్లూరు : ప్రత్యేక హోదాపై ఆశలు సజీవంగా ఉన్నాయంటే ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గత నాలుగేళ్లుగా చేస్తున్న పోరాటమే కారణమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. జననేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 100వ రోజు సందర్భంగా నగరంలోని 100 ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు.
ఓటుకునోటు కేసుకు భయపడి, పోలవరం ప్రాజెక్టులో కమిషన్‌లకు కక్కుర్తిపడి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను గాలికి వదిలేసారని ధ్వజమెత్తారు. ఎన్నికలు దగ్గర పడటంతో చంద్రబాబు డ్రామాలు మొదలు పెట్టారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment