'చంద్రబాబును చూసి భయపడుతున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ నాయకుడు భూమన కరుణాకర రెడ్డి విమర్శించారు. ఎన్నికల హామీలను సీఎం చంద్రబాబు తొంగలో తొక్కారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం భూమన విలేకరులతో మాట్లాడారు. అన్నివర్గాలను మోసం చేసి మాయల మరాఠిలనే చంద్రబాబు మించి పోయారని అన్నారు. ఆయనను చూసి ప్రజలు భయపడుతున్నారని అన్నారు. చంద్రబాబును మోసాలను ప్రజల మధ్యకు వెళ్లి ఎండగడతామన్నారు. ప్రజావ్యతిరేక పాలన ఎల్లకాలం సాగదన్నారు. ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
- ఎన్నికలకు ముందు ఓట్లు రైతులకు వెతలను తీరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు
- మీ కన్నీళ్లను తుడుస్తానని, బ్యాంకుల్లో బంగారం విడిపిస్తానన్నారు
- డ్వాక్రా మహిళల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని వాగ్దానం చేశారు
- అప్పుడు 88 వేల కోట్ల రూపాయలుగా ఉన్న అప్పు, ఇప్పుడు లక్షా 10 వేల కోట్లుగా మారింది
- మొదటి విడతలో కేవలం రూ. 11 వేల కోట్ల మాఫీ చేశారు
- మరో రూ. 13 వేల కోట్లు వచ్చే మూడేళ్లలో మాఫీ చేస్తామంటున్నారు.
- దీనిబట్టే చంద్రబాబు ఎంతగా అబద్ధాలు చెబుతున్నారో తెలుస్తోంది
- వీధుల్లో తిరిగే మోసగాళ్లు కూడా ఇంతగా అబద్ధాలు చెప్పరు
- మాయల మరాఠీలను, మంత్రగాళ్లను మించిన మాయగాడు చంద్రబాబు
- ఎన్నికల్లో 600కు పైగా వాగ్దానాలు చేశారు
- ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు
- సీఎం అయ్యాక చేసిన ఐదు సంతకాల్లో కూడా ఒక్కటి కూడా అమలు కాలేదు
- చంద్రబాబు ఊక దంపుడు ఉపన్యానాలు వినలేక జనం భయపడుతున్నారు
- బుచాణ్ని చూస్తే ఎలా భయపడతారో అలాంటి పరిస్థితి వచ్చింది
- దోపిడీ చేయడంలో అగ్రగామిగా ఆయన నిలిచిపోతాడు
- ప్రజల జ్ఞాపక శక్తి తక్కువని, ఎన్ని అబద్దాలు చెప్పినా నడచిపోతుందనుకుంటున్నాడు
- జులై 8న నుంచి గడప గడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళుతున్నాం
- ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేసిన హామీలు అమలు గురించి అడుగుతాం
- దగాకోరు వంచనపై ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకుంటాం
- ఎవరు నిజమో, ఎవరు అబద్ధమో ప్రజలే తేలుస్తారు
- చంద్రబాబు వ్యవసాయ వ్యతిరేక విధానాలతో కోనసీమలోని అల్లవరం మండల గ్రామాలు క్రాప్ హాలీడే ప్రకటించాయి
- రైతు బాంధవుడని చెప్పుకుంటున్న చంద్రబాబు గత చరిత్ర అంతా రైతు వ్యతిరేకమే
- ప్రజల పట్ల చులకన భావంతో చంద్రబాబు వంచన కౌశలం వంద రెట్లు పెరిగింది
- చంద్రబాబుది ప్రజాకంటక పాలన, ఏ ఒక్కరికీ మేలు చేయలేదు
- తన పాలన పట్ల అభిప్రాయభేదాలు వ్యక్తం చేసిన వారిపై ఇనుప పాదాలు మోపుతున్నారు
- ప్రజాద్రోహులుగా ముద్ర వేసి ప్రతీకార చర్యలు తీసుకుంటూ రాజకీయ రాక్షసుడిగా మారారు
- బీసీల్లో చేరుస్తామని కాపులను వంచిండడం లోకమంతా చూసింది
- ముద్రగడ కుటుంబం పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు అమానుషం
- ప్రజావ్యతిరేక పాలన ఎంతో కాలం కొనసాగదు
- చంద్రబాబుపై ప్రజలు తిరబడేరోజు దగ్గరలోనే ఉంది