పవన్, త్రివిక్రమ్‌ల తీన్మార్
తెలుగు ఇండస్ట్రీలో కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉన్న మైత్రీ మూవీస్ క్రేజీ కాంబినేషన్లను సెట్ చేస్తోంది. తొలి సినిమాతోనే మహేష్ బాబు లాంటి టాప్ స్టార్తో శ్రీమంతుడు సినిమా చేసిన మైత్రీ మూవీస్ టీం, రెండో సినిమాగా కూడా ఆసక్తికరమైన కాంబినేషన్ను సెట్ చేశారు. ప్రస్తుతం నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్లో ఉన్న ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు రాకముందే మరో భారీ ప్రాజెక్ట్ను ఫైనల్ చేశారు.
జల్సా, అత్తారింటికి దారేది లాంటి భారీ సక్సెస్లు అందించిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ల కాంబినేషన్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. చాలా కాలంగా ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమాకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ దశలో త్రివిక్రమ్తో సినిమాను పవన్ స్వయంగా నిర్మించాలని కూడా భావించాడు. అయితే ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్ను మరోసారి తెర మీదకు తీసుకువచ్చే బాధ్యతను మైత్రీ మూవీస్ తీసుకుంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది అన్న విషయం మీద మాత్రం క్లారిటీ రాలేదు.