పంచ్‌ పడుద్ది | Arun Vijay starts MMA training for Boxer | Sakshi
Sakshi News home page

పంచ్‌ పడుద్ది

Published Tue, May 14 2019 3:50 AM | Last Updated on Tue, May 14 2019 3:50 AM

Arun Vijay starts MMA training for Boxer - Sakshi

అరుణ్‌ విజయ్‌

ఓ వైపు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తూనే మరోవైపు హీరోగానూ కొనసాగుతున్నారు అరుణ్‌ విజయ్‌. గతేడాది ‘తడం’ అనే తమిళ థ్రిల్లర్‌ చిత్రంతో సూపర్‌ హిట్‌ సాధించిన ఆయన తాజాగా ‘బాక్సర్‌’ అనే సినిమా అంగీకరించారు. ఇందులో బాక్సర్‌ పాత్రలో కనిపించనున్నారు అరుణ్‌ విజయ్‌. ఈ పాత్ర కోసం మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారట. ఆల్రెడీ వియత్నాంలో ట్రైనింగ్‌ కూడా మొదలెట్టారు. వివేక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్‌ డ్రామాలో రితికా సింగ్‌ హీరోయిన్‌. స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ పాత్రలో ఆమె కనిపిస్తారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ‘సాహో’ సినిమాలో అరుణ్‌ విజయ్‌ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement