స్టార్ హీరో కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. తమిళంలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాని తెలుగులోనూ విడుదల చేయాలనుకున్నారు. కానీ అక్కడ ఫలితం చూసి తెలుగు వెర్షన్ రిలీజ్ ఆలోచన మానుకున్నారు. ఇప్పుడీ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోకి తీసుకొచ్చేయబోతున్నారట. తాజాగా స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా మూవీ?
ఈ సంక్రాంతికి తెలుగులో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ చిత్రాలు రిలీజయ్యాయి. వీటిలో బాక్సాఫీస్ విన్నర్‌గా 'హనుమాన్' నిలిచింది. ఇది తప్పితే మిగతా మూడు చిత్రాలు ఓటీటీలోకి వచ్చేశాయి. మరోవైపు తమిళంలోనూ సంక్రాంతికి రిలీజైన 'కెప్టెన్ మిల్లర్', 'అయలాన్' హిట్ టాక్ తెచ్చుకున్నాయి. కొన్నిరోజుల క్రితం ఓటీటీలోకి కూడా వచ్చేశాయి. వీటితో పాటు తమిళంలో ఇదే పండక్కి 'మిషన్ ఛాప్టర్ 1' చిత్రం కూడా రిలీజైంది.
(ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
యాక్షన్ స్టోరీతో తీసిన ఈ సినిమాని తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ సొంత భాషలోనే తేడా కొట్టేయడంతో మన దగ్గర థియేటర్లలో విడుదల చేయడం అనే ఆలోచనని పూర్తిగా పక్కనబెట్టేశారు. అలా అందరూ మర్చిపోయిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి సిద్ధమైందట. మార్చి 1 నుంచి దక్షిణాది భాషల్లో అందుబాటులోకి రానుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
మిషన్ ఛాప్టర్-1 కథ విషయానికొస్తే.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న తన కూతురిని ఎలాగైనా కలుసుకోవాలని.. విదేశీ జైలులో ఖైదీగా ఉండే హీరో అనుకుంటాడు? మరి ఇందుకోసం ఎలాంటి పోరాటం చేశాడు? విదేశీ జైలులో ఖైదీగా మారడానికి కారణమేంటనేదే స్టోరీ. అరుణ్ విజయ్ హీరోగా నటించగా.. అమీజాక్సన్, నిమిషా సజయన్ హీరోయిన్లుగా నటించారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!)
Comments
Please login to add a commentAdd a comment