సేతు, నందా, పితామహన్, నాన్ కడవుల్, అవన్ ఇవన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలా డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం వణంగాన్. ఇందులో అరుణ్ విజయ్ హీరోగా నటిస్తున్నాడు. తొలుత ఈ చిత్రంలో నటించిన హీరో సూర్యతో దర్శకుడికి విభేదాలు ఏర్పడడంతో ఆయన ఈ చిత్రం నుంచి వైదొలగారు. ఆ తర్వాత సూర్య పాత్రలో అరుణ్ విజయ్ నటిస్తున్నారు. ఇందులో రోషిని ప్రకాశ్, సముద్రఖని, మిష్కిన్ వంటి ప్రముఖులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
గతేడాది వణంగాన్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఇందులో శరీరమంతా బురదతో కనిపించిన అరుణ్ విజయ్ ఒక చేతిలో పెరియార్, మరో చేతిలో వినాయకుడి విగ్రహాలతో ఆక్రోషంగా కనిపించాడు. ఆ పోస్టర్ తెగ వైరలయింది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. కన్యాకుమారి సముద్ర తీరంలోని తిరువళ్లువర్ విగ్రహ విశ్వరూపంతో టీజర్ ప్రారంభమవుతుంది. దేవాలయం వెనుకవైపు బైక్‌పై నుదుట విభూది, కుంకుమతో అరుణ్ విజయ్ కనిపిస్తున్నారు. బావిలో నుంచి ఓ చేతితో పెరియార్, మరో చేతిలో వినాయకుడితో పైకి వస్తున్న అరుణ్ విజయ్ సీన్ ఆకట్టుకుంటోంది.
చదవండి: హీరోయిన్ త్రిషపై వల్గర్ కామెంట్స్.. సారీ చెప్పిన ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment