హీరో కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ చిత్రం.. పొంగల్‌ రేసులో.. | Hero Arun Vijay About Chapter 1 Movie | Sakshi
Sakshi News home page

Arun Vijay: డైరెక్టర్‌ నన్ను రెస్ట్‌ తీసుకోనివ్వలేదు.. సరైన సమయంలో సినిమా రిలీజ్‌

Published Sun, Jan 7 2024 12:07 PM | Last Updated on Sun, Jan 7 2024 12:33 PM

Hero Arun Vijay About Chapter 1 Movie - Sakshi

అరుణ్‌ విజయ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మిషన్‌ చాప్టర్‌ 1. అమీ జాక్సన్, నిమీషా విజయన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి జీవీ.ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందించారు. ఇది ఈయనకు సంగీత దర్శకుడిగా 100వ చిత్రం కావడం విశేషం. కాగా విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ విడుదల చేస్తోంది. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం పొంగల్‌ పండుగ సందర్భంగా ఈనెల 12న తెరపైకి రానుంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని సత్యం థియేటర్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విజయ్‌ మాట్లాడుతూ ఇంతకు ముందు చాలా చిత్రాలకు దర్శకత్వం వహించినా ఈ చిత్రం కొత్త అనుభవం అనిపించిందన్నారు. ఈ చిత్ర నిర్మాత స్వాతికి కృతజ్ఞతలు తెలుపుతూ.. తమిళ్‌ కుమరన్‌ ఈ చిత్రాన్ని చూసిన వెంటనే సహ నిర్మాతగా చేరారని చెప్పారు. పలు కష్టాలను అధిగమించి ఈ చిత్రాన్ని ఇక్కడివరకూ తీసుకొచ్చామని చెప్పారు. అరుణ్‌ విజయ్‌ మాట్లాడుతూ.. పొంగల్‌ సందర్భంగా విడుదలవుతున్న తన తొలి చిత్రం ఇది కావడం సంతోషంగా ఉందని చెప్పారు. మనం ఎంతగా శ్రమించినా సినిమా సరైన సమయంలో విడుదల కావడమే ముఖ్యం అన్నారు.

తాను ఇంతవరకూ నటించిన చిత్రాలన్నింటికంటే భారీ బడ్జెట్‌ చిత్రం మిషన్‌ చాప్టర్‌ 1 అని పేర్కొన్నారు. ఈ స్క్రిప్ట్‌ ఇచ్చిన దర్శకుడు విజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు విజయ్‌ పనితనం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఆయన చిత్రాన్ని చాలా వేగంగా, అదే సమయంలో చాలా క్వాలిటీతో తెరకెక్కించారని చెప్పారు. షూటింగ్‌ స్పాట్‌లో కాస్త విరామం తీసుకుందామని భావించినా, దర్శకుడు ఆ అవకాశం ఇవ్వలేదన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను లండన్, చెన్నైలలో నిర్వహించినట్లు చెప్పారు. చెన్నైలో నాలుగున్నర ఎకరాల్లో భారీ సెట్‌ వేసి యాక్షన్స్‌ సన్నివేశాలను చిత్రీకరించారని చెప్పారు.

చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హాట్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement