నన్ను నమ్మి రూ.25 కోట్లతో సినిమా తీసినందుకు థ్యాంక్స్‌: హీరో | Arun Vijay Comments on 'Mission Chapter 1' Thanks Giving Meet | Sakshi
Sakshi News home page

Arun Vijay: ప్రతి సినిమాలో నాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. నన్ను నమ్మి..

Published Fri, Jan 19 2024 12:05 PM | Last Updated on Fri, Jan 19 2024 12:14 PM

Arun Vijay Comments on Mission Chapter 1 Thanks Giving Meet - Sakshi

అరుణ్‌ విజయ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మిషన్‌ చాప్టర్‌–1. అమీ జాక్సన్‌, నిమీషా సజయన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని విజయ్‌ దర్శకత్వంలో వంశీ, రాజశేఖర్‌ నిర్మించారు. యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర విడుదల హక్కులను పొందిన లైకా ప్రొడక్షన్‌ సంస్థ దీన్ని సం‍క్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది.

మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు
మిషన్‌ చాప్టర్‌–1 సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ బుధవారం సాయంత్రం చైన్నెలో థ్యాంక్స్‌ గివింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో అరుణ్‌ విజయ్‌ మాట్లాడుతూ.. మంచి కథా చిత్రాలను ప్రేక్షకులు, మీడియా ఎప్పుడు నిరాకరించింది లేదన్నారు. అందుకే తాము థ్యాంక్స్‌ గివింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. తనకు ప్రతి చిత్రంలో ఏదో ఒక సమస్య ఏర్పడుతుందని.. అదే విధంగా ఈ చిత్రం కోసం శారీరకంగా చాలా కష్టపడినట్లు చెప్పారు.

ఇంత సక్సెస్‌ ఊహించలేదు
సినిమా విడుదలైన తరువాత మధురై, తిరుచ్చి ఇలా తాము వెళ్లిన ప్రతిచోటా ప్రేక్షకులు మిషన్‌ చాప్టర్‌–1ను విశేషంగా ఆదరిస్తున్నారని చెప్పారు. ఇంత సక్సెస్‌ను తాము ఊహించలేదని, ఇంతమంచి కథలో తమను భాగమయ్యేలా చేసిన దర్శకుడు విజయ్‌కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. తమను నమ్మి రూ.25 కోట్ల ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మించిన వంశీ, రాజశేఖర్‌లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. అదేవిధంగా ఆరంభ దశలో చిత్రం పలు సమస్యలను ఎదుర్కొందని గుర్తు చేసుకున్నారు. అలాంటిది ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన లైకా ప్రొడక్షన్స్‌కు, తమిళ్‌ కుమరన్‌కు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు.

చదవండి: గుంటూరు కారం కలెక్షన్స్‌.. ఆల్​టైమ్ రికార్డ్ సెట్‌ చేసిన మహేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement