ప్రొఫెషనల్’ బౌట్‌లకు అఖిల్, జితేందర్ రెడీ
న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ విజేందర్‌సింగ్ లాగే అఖిల్ కుమార్, జితేందర్ కుమార్‌లు కూడా ‘ప్రొఫెషనల్’ బాట పట్టారు. బీజింగ్ ఒలింపిక్స్ (2008)లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన వీరిద్దరు ప్రొఫెషనల్ సర్క్యూట్ లోఈ ఏడాది ఏకంగా ఆరు బౌట్‌లలో ఆడేందుకు సిద్ధమయా్యరు. 2006 మెల్‌బోర్న్ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత అయిన అఖిల్ ప్రొఫెషనల్ పోరు ఏప్రిల్ 1న ఆరంభం కానుంది. అఖిల్ సూపర్ లైట్ వెయిట్ కేటగిరీలో, జితేందర్ సూపర్ ఫెదర్ వెయిట్ కేటగిరీలో పోటీపడనున్నారు.
‘ఆరంగేట్రానికి తకు్కవ సమయమున్నప్పటికీ త్వరగానే ప్రొఫెషనల్ పోటీలకు అలవాటు పడిపోతామనే ఆత్మవిశ్వాసంతో ఉన్నాం’ అని 35 ఏళ్ల అఖిల్ అన్నాడు. జితేందర్ మాట్లాడుతూ ‘నేను, అఖిల్ ఈ ప్రయాణంలో విజయవంతమవుతామనే నమ్మకంతో ఉన్నాం’ అని అన్నాడు. హరియాణాకు చెందిన వీరిద్దరికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగాలిచ్చింది. ఇప్పుడు పోలీసు శాఖ అనుమతితోనే ‘ప్రొఫెషనల్’ బాక్సరు్లగా మారారు.