Jitender Kumar
-
సుశీల్ ఆశలకు జితేందర్ దెబ్బ
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాలని ఆశిస్తోన్న భారత రెజ్లింగ్ దిగ్గజం సుశీల్ కుమార్ ఆశలకు జితేందర్ దెబ్బ కొట్టాడు. ఆదివారం ముగిసిన ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో జితేందర్ 74 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. తద్వారా మార్చి 27 నుంచి 29 వరకు కిర్గిస్తాన్‌లో జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. సుశీల్ కూడా 74 కేజీల విభాగంలోనే పోటీపడతాడు. ఆసియా చాంపియన్‌షిప్ కోసం నిర్వహించిన ట్రయల్స్‌కు సుశీల్ డుమ్మా కొట్టాడు. గాయం కారణంగా తాను ట్రయల్స్‌కు హాజరుకాలేనని... ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం 74 కేజీల విభాగంలో మళ్లీ ట్రయల్స్ నిర్వహించాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)ను కోరాడు. అయితే సుశీల్ అభ్యర్థనను డబ్ల్యూఎఫ్ఐ పట్టించుకోలేదు. ఒకవేళ ఆసియా చాంపియన్‌షిప్‌లో జితేందర్ విఫలమైతేనే ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీకి మళ్లీ ట్రయల్స్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అయితే జితేందర్ రజత పతకం గెలవడంతో ఎలాంటి ట్రయల్స్ లేకుండానే అతను ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆదివారం ప్రకటించారు. ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో జితేందర్ ఫైనల్ చేరుకుంటే అతనికి ‘టోక్యో’ బెర్త్ లభిస్తుంది. సుశీల్‌కు అధికారికంగా ‘టోక్యో’ దారులు కూడా మూసుకుపోతాయి. ఒకవేళ జితేందర్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోకపోతే ఏప్రిల్ 30 నుంచి మే 3 వరకు బల్గేరియాలో జరిగే వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ రూపంలో సుశీల్, జితేందర్‌లకు చివరి అవకాశం లభిస్తుంది. ఆదివారం జరిగిన 74 కేజీల విభాగం ఫైనల్లో జితేందర్ 1–3తో డిఫెండింగ్ చాంపియన్ దనియర్ కైసనోవ్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా, 61 కేజీల విభాగంలో రాహుల్ అవారె కాంస్య పతకాలు నెగ్గారు. కాంస్య పతక బౌట్లలో దీపక్ పూనియా 10–0తో అబ్దుల్ సలామ్ (ఇరాక్)పై, రాహుల్ 5–2తో మాజిద్ దస్తాన్ (ఇరాన్)పై గెలిచారు. సతీందర్ (125 కేజీలు), సోమ్‌వీర్ (92 కేజీలు) విఫలమయ్యారు. ఓవరాల్‌గా భారత్ ఆసియా చాంపియన్‌షిప్‌లో 5 స్వర్ణాలు, 6 రజతాలు, 9 కాంస్య పతకాలు సాధించింది. దీపక్, రాహుల్ -
సుశీల్ భవితవ్యం జితేందర్ చేతిలో...
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడు, భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ‘2020–టోక్యో ఒలింపిక్స్’లో బరిలోకి దిగేది లేనిది సహచర రెజ్లర్ జితేందర్ కుమార్ నిర్ణయించే పరిస్థితి ఏర్పడింది. ఈనెల 15 నుంచి 18 వరకు ఇటలీలో జరిగే వరల్డ్ సిరీస్ ర్యాంకింగ్ టోర్నీలో... ఫిబ్రవరి 18 నుంచి 23 వరకు న్యూఢిల్లీలో జరిగే ఆసియా ఛాంపియన్ షిప్ లో... మార్చి 27 నుంచి 29 వరకు చైనాలో జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే భారత జట్లను శుక్రవారం ట్రయల్స్ ద్వారా ఎంపిక చేశారు. 74 కేజీల విభాగంలో పోటీపడాల్సిన సుశీల్ కుమార్ గాయం కారణంగా ట్రయల్స్‌కు దూరమయ్యాడు. దాంతో 74 కేజీల విభాగంలో జితేందర్ కుమార్ విజేతగా నిలిచి వరల్డ్ సిరీస్ ర్యాంకింగ్ టోర్నీ, ఆసియా ఛాంపియన్ షిప్, ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. 74 కేజీల ట్రయల్స్ ఫైనల్లో జితేందర్ 5–2తో అమిత్ ధన్కర్పై గెలిచాడు. ఒకవేళ చైనా ఆతిథ్యమిచ్చే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో జితేందర్ ఫైనల్‌కు చేరుకుంటే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాడు. జితేందర్ అర్హత సాధించిన పక్షంలో ఈ విభాగంలో సుశీల్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉండ దు. గతంలో కూడా ఒలింపిక్స్ బెర్త్ సంపాదించిన రెజ్లర్లకు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎలాంటి ట్రయల్స్ నిర్వహించకుండా నేరుగా ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం కలి్పంచింది. అయితే జితేందర్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీలో, ఆసియా చాంపియన్íÙప్లో విఫలమైతే మాత్రం ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోరీ్నకి ముందు మరోసారి ట్రయల్స్ నిర్వహించే అవకాశముందని... ఈ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు సుశీల్‌కు అవకాశమిస్తామని డబ్ల్యూఎఫ్ఐ తెలిపింది. -
ప్రొఫెషనల్’ బౌట్లకు అఖిల్, జితేందర్ రెడీ
న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ విజేందర్‌సింగ్ లాగే అఖిల్ కుమార్, జితేందర్ కుమార్‌లు కూడా ‘ప్రొఫెషనల్’ బాట పట్టారు. బీజింగ్ ఒలింపిక్స్ (2008)లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన వీరిద్దరు ప్రొఫెషనల్ సర్క్యూట్ లోఈ ఏడాది ఏకంగా ఆరు బౌట్లలో ఆడేందుకు సిద్ధమయా్యరు. 2006 మెల్బోర్న్ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత అయిన అఖిల్ ప్రొఫెషనల్ పోరు ఏప్రిల్ 1న ఆరంభం కానుంది. అఖిల్ సూపర్ లైట్ వెయిట్ కేటగిరీలో, జితేందర్ సూపర్ ఫెదర్ వెయిట్ కేటగిరీలో పోటీపడనున్నారు. ‘ఆరంగేట్రానికి తకు్కవ సమయమున్నప్పటికీ త్వరగానే ప్రొఫెషనల్ పోటీలకు అలవాటు పడిపోతామనే ఆత్మవిశ్వాసంతో ఉన్నాం’ అని 35 ఏళ్ల అఖిల్ అన్నాడు. జితేందర్ మాట్లాడుతూ ‘నేను, అఖిల్ ఈ ప్రయాణంలో విజయవంతమవుతామనే నమ్మకంతో ఉన్నాం’ అని అన్నాడు. హరియాణాకు చెందిన వీరిద్దరికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగాలిచ్చింది. ఇప్పుడు పోలీసు శాఖ అనుమతితోనే ‘ప్రొఫెషనల్’ బాక్సరు్లగా మారారు.