
పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత బాక్సర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే దీపక్, నరేందర్, జాస్మిన్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టగా... తాజాగా వీరి సరసన మరో భారత బాక్సర్ లక్ష్య చహర్ కూడా చేరాడు. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 80 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్‌లో ఇరాన్ బాక్సర్ గెష్‌లగి మేసమ్ భారత జాతీయ చాంపియన్ లక్ష్య చహర్‌ను నాకౌట్ చేశాడు.