
కథ నచ్చితే తన పాత్ర కోసం ఎంతైనా శ్రమిస్తారు మోహన్‌లాల్. తాజాగా ఆయనకు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ స్క్రిప్ట్ ఒకటి నచ్చిందట. అంతే.. చేతికి గ్లౌజ్‌లు తొడిగి బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఈ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇందులో మోహన్‌లాల్ బాక్సింగ్ ఛాంపియన్‌గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆరుపదుల వయసులో ఉన్నారు మోహన్‌లాల్. ఈ వయసులో ఓ స్పోర్ట్స్ ఫిల్మ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అది కూడా బాక్సింగ్ క్యారెక్టర్ చేయడానికి రెడీ కావడం అంటే గొప్ప విషయమే.
Comments
Please login to add a commentAdd a comment