'అమీర్ ఖాన్ ప్రశంసలతో ఆనందించా' | Vijender flattered beyond words by Amir Khan's praise | Sakshi
Sakshi News home page

'అమీర్ ఖాన్ ప్రశంసలతో ఆనందించా'

Published Thu, Nov 5 2015 12:06 PM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM

'అమీర్ ఖాన్ ప్రశంసలతో ఆనందించా'

'అమీర్ ఖాన్ ప్రశంసలతో ఆనందించా'

ఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్గా మారి తొలి బౌట్లో సత్తా చాటిన భారత బాక్సర్ విజేందర్ సింగ్ను బ్రిటీష్ బాక్సర్ అమీర్ ఖాన్ పొగడ్తలతో ముంచెత్తాడు. విజేందర్ సింగ్లో టెక్నిక్, ప్రతిభ అమోఘంగా ఉన్నయని, భారత్లో ఎంతో మంది బాక్సర్లకు విజేందర్ సింగ్ స్పూర్తిగా నిలువడమే కాకుండా ప్రొఫెషనల్ బాక్సింగ్ వైపు అడుగులు వేసేలా ప్రభావితం చేస్తాడని అమీర్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించాడు.

అమీర్ ఖాన్ పొగడ్తలపై విజేందర్ సింగ్ గురువారం సంతోషం వ్యక్తం చేశారు. డబ్ల్యూబీఏ, ఐబీఎఫ్ వరల్డ్ టైటిల్లను గెలిచిన అమీర్ ఖాన్ లాంటి గొప్ప బాక్సర్ తనను మెచ్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. శనివారం బ్రిటీష్ బాక్సర్ డీన్ గిలెన్తో విజేందర్ సింగ్ తలపడనున్నాడు. డబ్లిన్లో జరగనున్న తన రెండవ ప్రొఫెషనల్ ఫైట్ పట్ల ఆసక్తిగా ఉన్నానని విజేందర్ తెలిపాడు. విజయం పట్ల నమ్మకంగా ఉన్నానని చెప్పిన విజేందర్ తన ఆటలో టెక్నిక్, డిఫెన్స్లను మెరుగుపర్చుకోవడానికి కృషి చేస్తున్నట్లు చెప్పాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement