flattered
-
అఫ్గాన్ భూకంప విలయం.. 2000 మంది మృతి
కాబూల్: ఆఫ్గానిస్థాన్‌లో భూకంపం విధ్వంసం సృష్టించింది. భూకంప తీవ్రతకు భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటివరకు దాదాపు 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు దశాబ్దాల్లో ఇంతస్థాయిలో భూకంపం ఎప్పుడూ సంభవించలేదని అధికారులు తెలిపారు. వేలాది ఇళ్లు నేలకూలాయి. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. Today’s earthquake in Herat province of Afghanistan has completely destroyed four villages and many people have lost their lives. May Allah have mercy on them. pic.twitter.com/zWArtneBZs — اماراتي ځـدراڼ (@AmaratyD34809) October 8, 2023 అఫ్గాన్–ఇరాన్ సరిహద్దులకు సమీపంలోని హీరట్ పరిసరాల్లో శనివారం మధ్యాహ్నం కనీసం ఏడుసార్లు భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని పేర్కొంది. భూకంప ధాటికి ఆరు గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాదాపు 400కు పైగా ఇళ్లు నేలకూలాయి. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. గత ఏడాది తూర్పు ఆఫ్గానిస్థాన్‌లో భయంకరమైన భూకంపం సంభవించింది. కొండప్రాంతాల్లో గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ భూకంపంలో దాదాపు 1000 నుంచి 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌లో మరింత దారుణం.. యుద్ధంలోకి ‘హెజ్బొల్లా’ గ్రూప్ Follow the Sakshi Telugu News channel on WhatsApp: -
'అమీర్ ఖాన్ ప్రశంసలతో ఆనందించా'
ఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారి తొలి బౌట్లో సత్తా చాటిన భారత బాక్సర్ విజేందర్ సింగ్‌ను బ్రిటీష్ బాక్సర్ అమీర్ ఖాన్ పొగడ్తలతో ముంచెత్తాడు. విజేందర్ సింగ్‌లో టెక్నిక్, ప్రతిభ అమోఘంగా ఉన్నయని, భారత్‌లో ఎంతో మంది బాక్సర్లకు విజేందర్ సింగ్ స్పూర్తిగా నిలువడమే కాకుండా ప్రొఫెషనల్ బాక్సింగ్ వైపు అడుగులు వేసేలా ప్రభావితం చేస్తాడని అమీర్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అమీర్ ఖాన్ పొగడ్తలపై విజేందర్ సింగ్ గురువారం సంతోషం వ్యక్తం చేశారు. డబ్ల్యూబీఏ, ఐబీఎఫ్ వరల్డ్ టైటిల్‌లను గెలిచిన అమీర్ ఖాన్ లాంటి గొప్ప బాక్సర్ తనను మెచ్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. శనివారం బ్రిటీష్ బాక్సర్ డీన్ గిలెన్తో విజేందర్ సింగ్ తలపడనున్నాడు. డబ్లిన్‌లో జరగనున్న తన రెండవ ప్రొఫెషనల్ ఫైట్ పట్ల ఆసక్తిగా ఉన్నానని విజేందర్ తెలిపాడు. విజయం పట్ల నమ్మకంగా ఉన్నానని చెప్పిన విజేందర్ తన ఆటలో టెక్నిక్, డిఫెన్స్‌లను మెరుగుపర్చుకోవడానికి కృషి చేస్తున్నట్లు చెప్పాడు.