Vijender
-
ఎవరూ నమ్మరు
ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి, విజయేందర్, రాకేష్ ముఖ్య పాత్రల్లో ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెప్పినా ఎవరూ నమ్మరు’. ఎం.మురళీ శ్రీనివాసులు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. హీరో, డైరెక్టర్ ఆర్యన్ కృష్ణ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ట్రైలర్, ఫస్ట్ లుక్కు చాలా మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ చూసి థియేటర్లో మా సినిమాను విడుదల చెయ్యడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చారు. జనవరి 1న విడుదల చేయాలనుకున్నాం.. అయితే థియేటర్ల సమస్య వల్ల మూవీ మాక్స్ అధినేత శ్రీనివాసులు ద్వారా ఈ నెల 29న విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో సహజమైన సన్నివేశాలు ఉంటాయి. ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఎం. మురళీ శ్రీనివాసులు. -
కానిస్టేబుల్ ప్రాణాన్ని కాపాడిన పర్సు!
ఫిరోజాబాద్: కొన్ని నాణేలు, నాలుగు ఏటీఎం కార్డులు, ఒక శివుడి ఫొటో ఉన్న పర్సు ఓ కానిస్టేబుల్ ప్రాణాన్ని కాపాడింది. అదెలా అనుకుంటున్నారా? పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జరుగుతున్న ఆందోళనల్లో కానిస్టేబుల్ విజేందర్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. ‘ఆందోళనకారులెవరో కాల్పులు జరిపారు. దీంతో దూసుకొచ్చి న బుల్లెట్ నా జాకెట్ నుంచి చొచ్చుకుపోయి నా జేబులో ఉన్న పర్సులో చిక్కుకుపోయింది. పర్సులో కొన్ని నాణేలు, ఏటీఎం కార్డులు, శివుని ఫొటో ఉన్నాయి. నిజంగా నాకిది పునర్జన్మగా భావిస్తున్నాను’అని విజేందర్ చెప్పారు. -
చైనాపై భారత్ ఘన విజయం
ముంబై : భారత స్టార్ ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ హోరాహోరీగా జరిగిన ఉత్కంఠ పోరులో చైనా బాక్సర్ జుల్పికర్ మైమైటియాలిని మట్టికరిపించాడు. ఈ క్రమంలో వరుసగా తొమ్మిదో బౌట్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ముంబైలో శనివారం రాత్రి జరిగిన బౌట్లో డబ్ల్యూబీవో ‘డబుల్’ టైటిల్‌ను విజేందర్ సింగ్ గెలిచి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. విజేందర్ ఖాతాలో రెండో డబ్ల్యూబీఏ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ చేరింది. 10 రౌండ్లపాటు హోరాహోరీగా సాగిన బౌట్ మధ్య రౌండ్లలో వెనక్కి తగ్గినట్లు కనిపించినా విజేందర్ పట్టువదలకుండా పోరాడాడు. ఈ విజయంతో ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో ఇప్పటివరకూ అపజయం ఎరుగని బాక్సర్‌గా విజేందర్ నిలిచాడు. తాను ఆడిన 9 బౌట్లలోనూ విజయం సాధిస్తూ దూసుకుపోతున్నాడు. -
‘ప్రొఫెషనల్’గా దివాకర్, మదన్
న్యూఢిల్లీ: ఒలింపియన్ దివాకర్ ప్రసాద్, జాతీయ మాజీ చాంపియన్ మదన్‌లాల్ ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగు పెట్టనున్నారు. ఈ అమెచ్యూర్ బాక్సర్లు మంగళవారం ఐఓఎస్ బాక్సింగ్ ప్రమోషన్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దివాకర్, మదన్‌తో పాటు మరో 11 మంది కూడా ఐఓఎస్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటికే విజేందర్, అఖిల్ కుమార్ వంటి వారిని ఈ సంస్థ ప్రమోట్ చేస్తోంది. ప్రొఫెషనల్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాలో సభ్యులైన కామన్వెల్త్గేమ్స్ మెడలిస్ట్ అమన్‌దీప్ సింగ్, నీరజ్ గోయత్ వంటి ఆటగాళ్లు కూడా ఈ సంస్థతో కొత్తగా ఒప్పందం చేసుకున్నారు. ‘ఇప్పుడు మాతో 16 మంది బాక్సర్లు ఉన్నారు. వీరందరికీ గుర్గావ్లోని మా అకాడమీలో శిక్షణ ఇస్తాం’ అని ఐఓఎస్ డైరెక్టర్ గౌరవ్ తోమర్ తెలిపారు. ‘ఐదేళ్ల కింద భారత్‌లో ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు అంతగా గుర్తింపు లేదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. అందుకే ప్రొఫెషనల్‌గా మారాలని నిర్ణయం తీసుకున్నాను’ అని 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన జార్ఖండ్ బాక్సర్ దివాకర్ ప్రసాద్ తెలిపాడు. -
గుండెపోటుతో కౌలు రైతు మృతి
పత్తి విత్తనాలు మొలకెత్తక పోవడంతో కలత చెందిన కౌలు రైతు గుండె పోటుతో మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా శాయంపేటలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన ఉప్పుల విజేందర్(36) మేస్ర్తీ పనులు చేసుకుంటూనే రెండెకరాలు పొలం కౌలు తీసుకున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి విత్తనాలు వేశాడు. తర్వాత వర్షం ముఖం చాటేయడంతో విత్తనాలు సక్రమంగా మొలవలేదు. దీంతో కలత చెందాడు. ఇదే విషయాన్ని ఉదయం కుటుంబ సభ్యులతో చెబుతూ.. గుండె పోటుతో అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించే లోపే మృతి చెందాడు. -
అతనికి హారర్ షో చూపిస్తా!
బోల్టాన్: శుక్రవారం జరగనున్న తన ఆరో ప్రొఫెషనల్ ఫైట్‌లో విజయంపై దీమాతో ఉన్నాడు విజేందర్ సింగ్. ఇప్పటివరకు పాల్గొన్న ఐదు బౌట్లలో అన్నింటినీ టెక్నికల్ నాకౌట్ ద్వారా గెలుచుకున్న విజేందర్.. తొలిసారిగా సోల్డ్రాతో తలపడనున్న ఎనిమిది రౌండ్ల పోరు కోసం భారీగా కసరత్తులు చేసినట్లు వెల్లడించాడు. 'తొలి సారిగా ఎనిమిది రౌండ్ల పోరులో తలపడుతున్నాను. దీని కోసం ఓర్పుగా ఎక్కువ సమయం రింగ్‌లో సామర్థ్యం మేర రాణించడంపై దృష్టి పెట్టాను. రోజురోజుకూ కఠినమైన శిక్షణ పొందుతున్నాను. ఈ బౌట్లో విజయం ద్వారా నా ప్రొ బాక్సింగ్ కెరీర్‌ను 6-0కు తీసుకెళ్లాలనుకుంటున్నాను' అని విజేందర్ గురువారం వెల్లడించాడు. అయితే ఆరో రౌండ్లో తలపడనున్న ప్రత్యర్థి.. పోలాండ్‌కు చెందిన సోల్డ్రా మాత్రం రేపు విజేందర్కు హారర్ షో చూపిస్తానంటూ హెచ్చరికలు పంపాడు. అమెచ్యూర్ కేటగిరీలో పాల్గొన్న 98 ఫైట్లలో 82 విజయాలు సాధించిన సోల్డ్రా.. ప్రొ బాక్సింగ్ కెరీర్లో సైతం 16 ఫైట్లలో 12 విజయాలు సాధించి మంచి రికార్డుతోనే ఉన్నాడు. ఇప్పటికే విజేందర్ బొక్కలిరగ్గొడతానంటూ వ్యాఖ్యలు చేసిన సోల్డ్రా ఫైట్‌పై ఆసక్తిని పెంచిన విషయం తెలిసిందే. అయితే తుదిపోరులో సోల్డ్రా రాణిస్తాడా.. లేక గతంలో విజేందర్‌ను మట్టికరిపించేందుకు పామురక్తం తాగానంటూ వ్యాఖ్యానించి చివరికి రింగ్‌లో చేతులెత్తేసిన అలెగ్జాండర్ హోర్వత్ మాదిరిగానే తోకముడుస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. -
జూన్ 11న విజేందర్ తొలి టైటిల్ బౌట్
న్యూఢిల్లీ: స్టార్ బాక్సర్ విజేందర్ తొలిసారిగా ప్రొఫెషనల్ టైటిల్ కోసం బరిలోకి దిగే బౌట్ ఎప్పుడనేది తేలింది. న్యూఢిల్లీలో జరిగే అవకాశం ఉన్న ఈ ఫైట్‌ను జూన్ 11న జరపాలని ప్రపంచ బాక్సింగ్ సంస్థ నిర్ణయించింది. ప్రొ సర్క్యూట్లో ఇప్పటిదాకా మూడు బౌట్స్‌లో తలపడి ఓటమి లేకుండా ఉన్నవిజేందర్ డబ్ల్యూబీవో మిడిల్‌వెయిట్ లేదా సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్ కోసం పోరాడనున్నాడు. ‘ఏ టైటిల్ అందుబాటులో ఉంటుందో చూడాల్సి ఉంది. తనకు సరైన ప్రత్యర్థిని వెతకడం ముఖ్యం. అన్నివిధాలా విజేందర్కు అనుకూల నిర్ణయం తీసుకుంటాం. ఇంతకుముందు ఈ ఫైట్‌ను సెప్టెంబర్‌లో జరపాలని భావించినా జూన్ సరైన సమయం అనిపించింది. సొంత గడ్డపై ఈ బౌట్ కోసం విజేందర్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు’ అని ఈ బాక్సర్ యూకే ప్రమోటర్స్కు చెందిన ఫ్రాన్సిస్ వారెన్ తెలిపారు. -
'అమీర్ ఖాన్ ప్రశంసలతో ఆనందించా'
ఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారి తొలి బౌట్లో సత్తా చాటిన భారత బాక్సర్ విజేందర్ సింగ్‌ను బ్రిటీష్ బాక్సర్ అమీర్ ఖాన్ పొగడ్తలతో ముంచెత్తాడు. విజేందర్ సింగ్‌లో టెక్నిక్, ప్రతిభ అమోఘంగా ఉన్నయని, భారత్‌లో ఎంతో మంది బాక్సర్లకు విజేందర్ సింగ్ స్పూర్తిగా నిలువడమే కాకుండా ప్రొఫెషనల్ బాక్సింగ్ వైపు అడుగులు వేసేలా ప్రభావితం చేస్తాడని అమీర్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అమీర్ ఖాన్ పొగడ్తలపై విజేందర్ సింగ్ గురువారం సంతోషం వ్యక్తం చేశారు. డబ్ల్యూబీఏ, ఐబీఎఫ్ వరల్డ్ టైటిల్‌లను గెలిచిన అమీర్ ఖాన్ లాంటి గొప్ప బాక్సర్ తనను మెచ్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. శనివారం బ్రిటీష్ బాక్సర్ డీన్ గిలెన్తో విజేందర్ సింగ్ తలపడనున్నాడు. డబ్లిన్‌లో జరగనున్న తన రెండవ ప్రొఫెషనల్ ఫైట్ పట్ల ఆసక్తిగా ఉన్నానని విజేందర్ తెలిపాడు. విజయం పట్ల నమ్మకంగా ఉన్నానని చెప్పిన విజేందర్ తన ఆటలో టెక్నిక్, డిఫెన్స్‌లను మెరుగుపర్చుకోవడానికి కృషి చేస్తున్నట్లు చెప్పాడు. -
కొత్త అధ్యాయం
తొలి ప్రొఫెషనల్ బాక్సింగ్ బౌట్‌కు విజేందర్ సిద్ధం నేడు సన్నీ వైటింగ్‌తో అమీతుమీ మైక్ టైసన్, హోలీఫీల్డ్, మేవెదర్... వీళ్ల గురించి మాత్రమే ఇన్నాళ్లూ విన్నాం. ప్రొఫెషనల్ బాక్సింగ్ అనేది భారత క్రీడాకారులకు ఇన్నాళ్లూ ఓ కల. దానిని సాకారం చేస్తున్నాడు భారత బాక్సర్ విజేందర్. ఒలింపిక్స్ బాక్సింగ్‌లో దేశానికి తొలి పతకం అందించిన విజేందర్... భారత బాక్సింగ్‌లో కొత్త అధ్యాయానికి తెర తీస్తున్నాడు. ప్రొఫెషనల్‌గా మారి తన తొలి బౌట్లో నేడు బరిలోకి దిగబోతున్నాడు. మాంచెస్టర్‌లో నేటి రాత్రి జరిగే పోరులో సన్నీ వైటింగ్‌తో యుద్ధానికి విజేందర్ సిద్ధమయ్యాడు. మాంచెస్టర్: బీజింగ్ ఒలింపిక్స్‌లో విజేందర్ సింగ్ కాంస్యం పతకం సాధించిన తర్వాత భారత్‌లో బాక్సింగ్ ఒక్కసారిగా జోరందుకుంది. అతన్ని స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది కుర్రాళ్లు బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే పతకం సాధించి స్టార్‌గా మారిపోయిన విజేందర్ ఇప్పుడు మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నాడు. ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో ఎక్కువ పతకాలు సాధించే అవకాశం ఉన్న అమెచ్యూర్ బాక్సింగ్‌ను కాదని ప్రొఫెషనల్ పోటీల వైపు అడుగుపెడుతున్నాడు. కాసుల వర్షంతో పాటు కష్టం కూడా ఎక్కువగా ఉండే ఈ పోటీల్లో ప్రతి అడుగు ఓ క్లిష్టమైన పోరాటం. ఓ రకంగా చెప్పాలంటే ప్రాణాలతో చెలగాటం కూడా. భివానీ నుంచే మొదలు.. డిగ్రీ అయిన వెంబడే విజేందర్ భివాని బాక్సింగ్ క్లబ్లో చేరి కోచ్ జగదీశ్ పర్యవేక్షణలో నైపుణ్యాన్ని మెరుగుపర్చుకున్నాడు. తర్వాత భారత జాతీయ కోచ్ గురుబక్ష్ సింగ్ శిక్షణలో మరింతగా రాటుదేలాడు. ఇక అక్కడినుంచి ఎన్నో అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్నా.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో అతని దశ, దిశ తిరిగిపోయింది. సింగిల్ నైట్‌లో స్టార్‌గా మారిపోయాడు. 2009లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, నంబర్‌వన్ హోదాతో ఓ వెలుగు వెలిగాడు. అదే ఏడాది రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర, 2010లో పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నాడు. కాసుల కోసమే... భారత బాక్సింగ్‌కు కొత్త ఊపు తెచ్చిన విజేందర్ ప్రొఫెషనల్‌గా మారడంతో ఒక్కసారి అందరూ షాక్‌కు గురయ్యారు. కాసుల కోసమే అతను ఆ విధంగా చేస్తున్నాడని విమర్శలు చెలరేగాయి. చాలా మంది అటు వైపు వెళ్లొద్దని వారించినా.. విజేందర్ మాత్రం ప్రొఫెషనల్ బౌట్ వైపే అడుగులు వేశాడు. ఇక దీన్నే కెరీర్‌గా మల్చుకునే ఆలోచనలో ఉన్న విజేందర్, తొలి బౌట్ కోసం గత కొన్ని నెలలుగా ప్రఖ్యాత కోచ్ లీ బియర్డ్ శిక్షణలో కఠోరంగా శ్రమిస్తున్నాడు. జిమ్‌లో గంటల తరబడి సాధన చేస్తున్నాడు. 39 ఏళ్ల బియర్డ్.. ప్రముఖ బాక్సర్ రిక్కీ హట్టన్, అతని సోదరుడు మ్యాథ్యూ హట్టన్లకు కోచ్‌గా పని చేశాడు. మేవెదర్ సీనియర్ వద్ద సహాయకుడిగా పని చేశాడు. బాక్సింగ్ కోచ్‌గా మారకముందు కిక్‌బాక్సింగ్, తైక్వాండోలో ప్రావీ ణ్యం సంపాదించాడు. రెండు గెలుపులు.. ఓ ఓటమి విజేందర్ ప్రత్యర్థి సన్నీ వైటింగ్కు ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో పెద్దగా అనుభవం లేదు. ఇంగ్లండ్‌లోని కెంట్ ప్రాంతానికి చెందిన సన్నీ ఇప్పటి వరకు కేవలం మూడు బౌట్లలో మాత్రమే పాల్గొన్నాడు. అందులో రెండు గెలిచి ఓ దాంట్లో ఓడాడు. అయితే తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థిని నాకౌట్ చేసి ఒక్కసారిగా సంచలనం సృష్టించాడు. విజేందర్‌తో బౌట్ గురించి సన్నీ పెద్దగా ఆందోళన చెందడం లేదు. భారత బాక్సర్‌ను చిన్న పిల్లాడిగా భావిస్తున్న వైటింగ్ తొలి బౌట్లో తన పంచ్ పవరెంటో చూపెడతానని చెబుతున్నాడు. క్వీన్స్ బెర్రీతో ఒప్పందం ప్రొఫెషనల్ బాక్సర్‌గా విజేందర్ క్వీన్స్ బెర్రీ ప్రమోషన్స్‌తో ఈ ఏడాది జూన్ 29న ఒప్పదం చేసుకున్నాడు. అయితే ఇప్పటికిప్పుడు విజేందర్కు పెద్ద మొత్తంలో డబ్బులు రాకపోయినా... అతని శిక్షణకు, ఇతరత్రా ఖర్చులకు సరిపోయే మొత్తాన్ని ఈ సంస్థ ఇవ్వనుంది. బౌట్లో నైపుణ్యాన్ని బట్టి విజేందర్ స్పాన్సర్షిప్ పెరిగే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో అభిమానులను అలరించగలిగితే భారత బాక్సర్ పంట పండినట్లే. అయితే ఈ బౌట్లో విజేందర్ గెలిచినా... సన్నీకే ఎక్కువ మొత్తంలో డబ్బులు వెళ్తాయి. ఎందుకంటే క్వీన్ బెర్రీ సంస్థ తమకొచ్చే డబ్బులో కొంత శాతం సన్నీకి ఇవ్వాల్సి ఉంటుంది. రాత్రి. గం 10.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సైనాకిస్తే నాకూ ఇవ్వాల్సిందే
పద్మభూషణ్ అవార్డుపై బాక్సర్ విజేందర్ న్యూఢిల్లీ: పద్మభూషణ్ అవార్డు కోసం ఇప్పుడు బాక్సర్ విజేందర్ కూడా గళమెత్తుతున్నాడు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా దరఖాస్తును ముందుగా తిరస్కరించినప్పటికీ తను అభ్యంతరం తెలపడంతో క్రీడా శాఖ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన రెజ్లర్ సుశీల్ కుమార్‌కు పద్మభూషణ్ అవార్డు రావాలని కోరుకుంటున్నట్టు విజేందర్ తెలిపాడు. ‘సైనాకు, నాకు 2010లోనే పద్మశ్రీ అవార్డు వచ్చింది. ప్రదర్శన పరంగా ఇద్దరం సమానంగానే ఉన్నాం. 2008లో ఒలింపిక్ కాంస్యం, 2009 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, ఆసియా గేమ్స్‌లో, ప్రపంచ పోలిస్ గేమ్స్‌లో స్వర్ణాలు సాధించాను. ఒకవేళ ఆమె పేరును ఈ అవార్డు కోసం ప్రతిపాదిస్తే నేను కూడా నా అదృష్టాన్ని పరీక్షించుకుంటా’ అని విజేందర్ అన్నాడు. -
ఐఏబీఎఫ్ రెబల్ వర్గానికి విజేందర్ మద్దతు
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్‌లో కొత్త సమాఖ్యగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్న రిటైర్డ్ బ్రిగేడియర్ పీకే మురళీధరన్ రాజాకు గట్టి మద్దతు లభించింది. ఒలింపిక్ కాంస్య పతక విజేత బాక్సర్ విజేందర్ సింగ్ ఈ రెబల్ వర్గానికి వెన్నంటి ఉంటానని ప్రకటించాడు. ప్రస్తుత కార్యనిర్వాహక సిబ్బంది ఆటకు మచ్చ తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారనే కారణంతో భారత బాక్సింగ్ సమాఖ్య (ఐఏబీఎఫ్) సభ్యత్వాన్ని ఐబా రద్దు చేసిన విషయం తెలిసిందే. వీరి స్థానంలో బాక్సింగ్ అభివృద్ధికి నిస్వార్థంగా సేవలందించగల వ్యక్తులు నూతన సమాఖ్యగా ఏర్పడేందుకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ఐబా కోరింది. మాజీ ప్రధాన కార్యదర్శి రాజా ఈ మేరకు తన వర్గంతో అథ్లెట్స్ కమిషన్‌ను కలిశారు. ‘రాజా అతడి సిబ్బంది బాక్సింగ్‌ను ప్రక్షాళన చేస్తారని భావిస్తున్నాను. వారు ఇప్పటికే విశ్వాసాన్ని చూరగొన్నారు. ప్రస్తుత సంక్షోభం నుంచి ఈ క్రీడను సమర్థవంతంగా గట్టెక్కించగల సామర్థ్యం రాజా గ్రూపునకు ఉందని న మ్ముతున్నాను’ అని విజేందర్ అన్నాడు.