చైనాపై భారత్‌ ఘన విజయం | boxer vijender beats China’s Zulpikar Maimaitiali to win unified WBO title | Sakshi
Sakshi News home page

చైనాపై భారత్‌ ఘన విజయం

Published Sat, Aug 5 2017 10:27 PM | Last Updated on Sun, Sep 17 2017 5:12 PM

చైనాపై భారత్‌ ఘన విజయం

చైనాపై భారత్‌ ఘన విజయం

ముంబై : భారత స్టార్‌ ప్రొఫెషనల్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ హోరాహోరీగా జరిగిన ఉత్కంఠ పోరులో చైనా బాక్సర్‌ జుల్పికర్‌ మైమైటియాలిని మట్టికరిపించాడు. ఈ క్రమంలో వరుసగా తొమ్మిదో బౌట్‌ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ముంబైలో శనివారం రాత్రి జరిగిన బౌట్‌లో డబ్ల్యూబీవో ‘డబుల్‌’ టైటిల్‌ను విజేందర్‌ సింగ్‌ గెలిచి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు.

విజేందర్ ఖాతాలో రెండో డబ్ల్యూబీఏ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్‌ టైటిల్ చేరింది. 10 రౌండ్లపాటు హోరాహోరీగా సాగిన బౌట్‌ మధ్య రౌండ్లలో వెనక్కి తగ్గినట్లు కనిపించినా విజేందర్ పట్టువదలకుండా పోరాడాడు. ఈ విజయంతో ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో ఇప్పటివరకూ అపజయం ఎరుగని బాక్సర్‌గా విజేందర్ నిలిచాడు. తాను ఆడిన 9 బౌట్లలోనూ విజయం సాధిస్తూ దూసుకుపోతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement