WBO title
-
చైనాపై భారత్ ఘన విజయం
ముంబై : భారత స్టార్ ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ హోరాహోరీగా జరిగిన ఉత్కంఠ పోరులో చైనా బాక్సర్ జుల్పికర్ మైమైటియాలిని మట్టికరిపించాడు. ఈ క్రమంలో వరుసగా తొమ్మిదో బౌట్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ముంబైలో శనివారం రాత్రి జరిగిన బౌట్లో డబ్ల్యూబీవో ‘డబుల్’ టైటిల్‌ను విజేందర్ సింగ్ గెలిచి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. విజేందర్ ఖాతాలో రెండో డబ్ల్యూబీఏ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ చేరింది. 10 రౌండ్లపాటు హోరాహోరీగా సాగిన బౌట్ మధ్య రౌండ్లలో వెనక్కి తగ్గినట్లు కనిపించినా విజేందర్ పట్టువదలకుండా పోరాడాడు. ఈ విజయంతో ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో ఇప్పటివరకూ అపజయం ఎరుగని బాక్సర్‌గా విజేందర్ నిలిచాడు. తాను ఆడిన 9 బౌట్లలోనూ విజయం సాధిస్తూ దూసుకుపోతున్నాడు. -
నేడు విజేందర్ డబ్ల్యుబీవో టైటిల్ బౌట్
తొలిసారిగా భారత్‌లో బరిలోకి న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన అనంతరం విజేందర్ సింగ్ తొలిసారిగా స్వదేశంలో బరిలోకి దిగబోతున్నాడు. ఇప్పటిదాకా తలపడిన ఆరు బౌట్లలో ఓటమనేది లేకుండా దూసుకెళుతున్న ఈ స్టార్ నేడు (శనివారం) జరిగే డబ్ల్యుబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ బెల్ట్ కోసం పోటీపడనున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన కెర్రీ హోప్ తన ప్రత్యర్థి. ‘ఈ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఆరేళ్ల అనంతరం ఢిల్లీలో పోటీకి దిగుతున్నాను. చివరిసారిగా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్నాను. నా శిక్షణ చాలా కఠినంగానే సాగింది. హోప్‌పై విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. ఇందులో నెగ్గితే డబ్ల్యుబీవో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-15లో ఉంటాను. దీంతో ప్రపంచ టైటిళ్ల కోసం పోటీపడే అర్హత దక్కుతుంది’ అని 30 ఏళ్ల విజేందర్ తెలిపారు. త్యాగరాజ స్టేడియంలో జరిగే ఈ ఫైట్‌ను తిలకించేందుకు క్రీడా ప్రముఖులతో పాటు రాజకీయ, సినీ రంగానికి చెందినవారు కూడా హాజరుకానున్నారు. అలాగే ఈ ఫైట్‌కు ముందు మరో ఏడు ఇతర బౌట్స్ జరుగుతాయి. రా. గం. 7.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
అది నాకు బిగ్ డీల్ కాదు: విజేందర్
న్యూఢిల్లీ:తనకు డబ్యూబీవో ఆసియా టైటిల్ బౌట్ అనేది ఎంతమాత్రం బిగ్ డీల్ కాదని భారత ప్రొ బాక్సర్ విజేందర్ సింగ్ స్పష్టం చేశాడు. ఈ పోరును సాధారణ బౌట్ గా మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నట్లు విజేందర్ పేర్కొన్నాడు. తన కెరీర్ లో పాల్గొన్న బాక్సింగ్ బౌట్ ల మాదిరిగానే, డబ్యూబీవో బౌట్ ను కూడా చూస్తున్నట్లు తెలిపాడు. ' నేను వరుసగా ఆరు ప్రొ బాక్సింగ్ బౌట్లు గెలిచా. అదే తరహాలో ఇది నాకు మరొక బౌట్. ఇప్పుడు నేను ప్రొ బాక్సర్ ని. అలానే తదుపరి బౌట్ కు సిద్దమవుతున్నా' అని విజేందర్ అన్నాడు. శనివారం జరిగే పోరుతో తన బాక్సింగ్ కెరీర్ ఏమీ ముగిసిపోదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్ తో జరిగే ఆ బౌట్ హోరాహోరీగా జరిగినా, మిగతా ఫైట్ తరహాలోనే ఈ పోరును కూడా చూస్తానన్నాడు. రింగ్ లోకి వెళ్లాక విజయంపైనే తన దృష్టి ఉంటుందన్నాడు. ఆ బౌట్ ముగిశాక మరో బౌట్ పై దృష్టిపెడతానని విజేందర్ పేర్కొన్నాడు. తన బౌట్లను ఉద్యోగంతో పోల్చిన విజేందర్.. ఈ పోరుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు తెలిపాడు. డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం జూలై 16న స్థానిక త్యాగరాజ స్టేడియంలో విజేందర్ -హోప్‌లు తలపడనున్న సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్‌గా మారిన విజేందర్ ఓటమి లేకుండా ఆరు నాకౌట్ విజయాలతో జోరు మీదున్నాడు. మరోవైపు ఈ రంగంలో 12 ఏళ్ల అనుభవం ఉన్న హోప్... ఇప్పటిదాకా తను 30 బౌట్లలో రెండు నాకౌట్లతో పాటు 23 విజయాలను సాధించాడు. -
'విజేందర్ కళ్లలో భయం చూశా'
న్యూఢిల్లీ: డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్‌తో తలపడబోతున్న ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్ మాటల యుద్ధాన్ని ముమ్మరం చేశాడు. భారత్ లో విజేందర్ స్టార్ కావొచ్చని, కానీ తన వరకూ బాక్సర్ మాత్రమేనని గతంలో వ్యాఖ్యానించిన హోప్.. తనతో పోటీ పడే స్థాయి అతనికి లేదన్నాడు. 'విజయం సాధించాలనే ఆసక్తి విజేందర్‌లో చాలా ఎక్కువ. అయితే నా బౌట్లో అది వదులుకోవాల్సిందే. ఆ విషయం అతనికి, నాకు తెలుసు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విజేందర్ కళ్లలో భయం చూశా. నాతో పోరంటే విజేందర్ భయపడుతున్నాడు. వరుస విజయాలు అతను సాధిస్తూ ఉండవచ్చు. అసలైన ప్రొఫెషనల్ బాక్సింగ్ అంటే ఏమిటో విజేందర్కు చూపిస్తా' అని కెర్రీ హోప్ విజయంపై భరోసా వ్యక్తం చేశాడు. ఇప్పటివరకూ విజేందర్ సుదీర్ఘ రౌండ్ల పోరు ఆడిన సందర్భాలు చాలా తక్కువని హోప్ పేర్కొన్నాడు. ఆది నుంచి విజేందర్ పై ఒత్తిడి పెంచి అతని భరతం పడతానన్నాడు. స్వదేశంలో విజేందర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బాగుందని, అయితే అథ్లెట్‌కు కావాల్సింది అనుభవం మాత్రమేనన్న సంగతి గుర్తుంచుకోవాలన్నాడు. అభిమానుల సహకారం అనేది బాక్సింగ్‌లో అస్సలు పనిచేయదన్నాడు. కేవలం ఇద్దరు బాక్సర్లతో పాటు రిఫరీ మాత్రమే ఉండే రింగ్ లో విశేష అభిమానం ఎంతమాత్రం ఉపయోగపడదని చురకలంటించాడు. డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం జూలై 16న స్థానిక త్యాగరాజ స్టేడియంలో విజేందర్ -హోప్‌లు తలపడనున్న సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్‌గా మారిన విజేందర్ ఓటమి లేకుండా ఆరు నాకౌట్ విజయాలతో జోరు మీదున్నాడు. మరోవైపు ఈ రంగంలో 12 ఏళ్ల అనుభవం ఉన్న హోప్... ఇప్పటిదాకా తను 30 బౌట్లలో రెండు నాకౌట్లతో పాటు 23 విజయాలను సాధించాడు.