
ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి, విజయేందర్, రాకేష్ ముఖ్య పాత్రల్లో ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెప్పినా ఎవరూ నమ్మరు’. ఎం.మురళీ శ్రీనివాసులు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. హీరో, డైరెక్టర్ ఆర్యన్ కృష్ణ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ట్రైలర్, ఫస్ట్ లుక్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ చూసి థియేటర్‌లో మా సినిమాను విడుదల చెయ్యడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చారు. జనవరి 1న విడుదల చేయాలనుకున్నాం.. అయితే థియేటర్ల సమస్య వల్ల మూవీ మాక్స్ అధినేత శ్రీనివాసులు ద్వారా ఈ నెల 29న విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో సహజమైన సన్నివేశాలు ఉంటాయి. ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఎం. మురళీ శ్రీనివాసులు.
Comments
Please login to add a commentAdd a comment