
Rocking Rakesh And Jordar Sujatha All Set To Tie Knot: ప్రేమ..ఎప్పుడు ఎలా అయినా పుట్టొచ్చు. ఇక నటీనటుల మధ్య ప్రేమ సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని జోడీలు కేవలం షో కోసం లవ్ ట్రాక్ నడిపితే మరికొందరేమో నిజంగానే లవ్‌లో పడతారు. అలాంటి జోడీనే రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాతలు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఓ షోలో పాల్గొన్న వీరిద్దరూ తమది రియల్ జోడీనే అని ప్రకటించారు. ఇక రాకేశ్ అయితే రింగ్ పెట్టి మరీ ప్రపోజ్ చేయగా సుజాత సిగ్గుతో నవ్వేసింది. త్వరలోనే తమ పెళ్లి ఉంటుందంటూ ఇద్దరూ హింట్ కూడా ఇచ్చేశారు. కాగా యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సుజాత బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్న సుజాత ప్రస్తుతం టీవీ షోలు చేస్తుంది.
ఈ క్రమంలోనే రాకింగ్ రాకేష్‌తో కలిసి పలు స్కిట్‌లు చేసింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, వీరి పెళ్లికి ఇరు వర్గాల కుటుంబసభ్యులు ఇప్పటికే అంగీకరించినట్లు తెలుస్తుంది. ఈ ఏడాదే వీరి పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు సమాచారం.