
జబర్దస్థ్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ తన ప్రేయసి జోర్దార్ సుజాతను పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట నిశ్చితార్థం ఇటీవలె జరగ్గా, తాజాగా వీరు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. బుల్లితెరపై పలు షోస్‌తో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడీ నిజజీవితంలోనూ రియల్ కపుల్ అనిపించుకున్నారు.
కుటుంబంసభ్యులు, సన్నిహితుల సమక్షంలో తిరుపతిలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పలువురు బుల్లితెర నటీనటులు సహా నెటిజన్ల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సుజాత తెలంగాన యాసలో మాట్లాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. బిగ్‌బాస్ షోలో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక జబర్దస్థ్ షోతో గుర్తింపు పొందిన రాకేశ్‌తో కలిసి పలు షోల్లో జంటగా పాల్గొంది. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబసభ్యుల అంగీకారంతో పెళ్లిపీటలు ఎక్కారు.
Comments
Please login to add a commentAdd a comment