తెలుగులో కామెడీ షో అనగానే చాలామందికి 'జబర్దస్త్' గుర్తొస్తుంది. ఓ సాధారణ కమెడియన్‌గా ఈ షోలో అడుగుపెట్టిన రాకేశ్.. ఆ తర్వాత టీమ్ లీడర్ రాకింగ్ రాకేశ్ అయ్యాడు. పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం తనే హీరోగా నటిస్తూ నిర్మిస్తూ 'కేసీఆర్' సినిమా తీస్తున్నాడు. అయితే ఈ మూవీ తీయడం కోసం ఇల్లు తాకట్టు పెట్టానని, కొందరు తనని మోసం చేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఏంటీ సినిమా?
కమెడియన్ రాకేశ్.. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఇప్పుడు ఏకంగా కోట్లు పెట్టి 'కేసీఆర్' అనే సినిమా తీస్తున్నారు. ఇది కేసీఆర్ జీవితం ఆధారంగా, ఆయనపై ఇష్టంతో తీస్తున్న సినిమా ఇది అని స్వయంగా రాకేశ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాడు. సినిమా అంటే కోట్ల వ్యవహారం కదా! అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయ్ అని యాంకర్ అడగడంతో.. తను ఎంతో కష్టపడి, ఇష్టంగా కట్టుకున్న ఇల్లు తాకట్టు పెట్టేశానని రాకేశ్ చెప్పుకొచ్చాడు. బినామీ డబ్బులతో నిర్మిస్తున్నాననే వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు.
(ఇదీ చదవండి: 'కేజీఎఫ్' స్టోరీతో మరో సినిమా.. జాతీయ అవార్డుకి గురిపెట్టిన హీరో)
మోసం చేశారు!
ఈ సినిమా చేస్తానని కొందరు వ్యక్తులు తనకు మాటిచ్చారని, వాళ్లు వెనక్కి తగ్గడంతోనే ప్రొడ్యూసర్ కావాల్సి వచ్చిందని రాకింగ్ రాకేశ్ చెప్పుకొచ్చుడ. అలానే ఓ రైటర్ మోసం చేయడం వల్ల సినిమా మొదలు కావడానికి ముందే కారు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని అన్నాడు. ఈ సినిమా నిర్మాణం గురించి తెలిసి అమ్మతో పాటు భార్య సుజాత తనని ఎంకరేజ్ చేశారని రాకేశ్ చెప్పుకొచ్చాడు.
తన భార్య సుజాత.. బ్యాంకులో దాచుకున్న డబ్బులిస్తానని తనకు ధైర్యం చెప్పిందని.. అలానే ఈ సినిమాకు రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్, క్యాస్టూమ్ డిజైనర్.. ఇలా చాలా పనుల్ని సుజూత చేస్తూ తనకు అండగా ఉందని రాకేశ్ చెప్పాడు. ఇదిలా ఉండగా కేసీఆర్ సినిమాతో తెలుగు నటి సత్యకృష్ణ కూతురు అనన్య మేనన్ ఇండస్ట్రీలోకి ఎంటారీ ఇస్తోంది. గరుడ వేగ అంజి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ఈ చిత్ర రిలీజ్ డేట్ వెల్లడించనున్నారు.
(ఇదీ చదవండి: వీళ్లకేమో తిట్లు.. శివాజీకేమో బుజ్జగింపులు.. ఏంటిది బిగ్‌బాస్?)
Comments
Please login to add a commentAdd a comment