తెలంగాణ తేజం పాటను ఆవిష్కరించిన కేసీఆర్‌.. నెట్టింట వైరల్‌ | Rocking Rakesh KCR Movie Telangana Tejam Song Out Now | Sakshi
Sakshi News home page

తెలంగాణ తేజం పాటను ఆవిష్కరించిన కేసీఆర్‌.. నెట్టింట వైరల్‌

Published Fri, May 31 2024 6:47 PM | Last Updated on Fri, May 31 2024 7:00 PM

Rocking Rakesh KCR Movie Telangana Tejam Song Out Now

'జబర్దస్త్' కమెడియన్ రాకింగ్ రాకేశ్.. ప్రస్తుతం 'కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్‌ )'  అనే టైటిల్‌తో ఒక సినిమా తీస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమాను నిర్మాతగా రాకింగ్‌ రాకేశ్‌ కావడం విశేషం. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా నుంచి తెలంగాణ తేజం పాటను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తాజాగా ఆవిష్కరించారు. హైదరాబాద్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి సినిమా హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్‌ దంపతులు వెళ్లి ఆయన్ను కలుసుకున్నారు. వారితో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌ ఉన్నారు. ఈ పాటను గోరేటి వెంకన్న రచించగా సింగర్స్‌ మనో, కల్పన, గోరేటి వెంకన్న ఆలపించారు. ఈ పాటకు నెట్టింట మంచి ఆదరణ లభిస్తుంది. పాటలో తెలంగాణ గొప్పతనాన్ని చాటి చెబుతూ సాగడంతో సోషల్‌మీడియాలో నెటిజన్లు భారీగా షేర్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement