జబర్దస్త్‌ కమెడియన్‌ చలాకీ చంటికి సీరియస్‌? ఐసీయూలో చికిత్స! | Is Comedian Chalaki Chanti Serious And Admitted To Hospital | Sakshi
Sakshi News home page

Chalaki Chanti: జబర్దస్త్‌ కమెడియన్‌ చలాకీ చంటికి సీరియస్‌? ఐసీయూలో చికిత్స!

Apr 23 2023 10:46 AM | Updated on Apr 23 2023 5:15 PM

Is Comedian Chalaki Chanti Serious And Admitted To Hospital - Sakshi

జబర్దస్త్‌ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కమెడియన్‌ చంటి. చలాకీతనం, తనదైన కామెడీ టైమింగుతో అలరించిన చంటి కొంతకాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. పలు కామెడీ షోస్ చేసిన చలాకీ చంటి సినిమాల్లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. బిగ్‌బాస్‌ సీజన్‌-6లోనూ పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. కానీ బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక ఏ షోలోనూ పెద్దగా కనిపించలేదు.

అయితే ప్రస్తుతం ఆయన తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఐసీయూలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది.  


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement